Telugu Global
Andhra Pradesh

పాదయాత్ర కొన‌సాగింపుపై డాక్టర్ల సూచనకు లోకేశ్ ఆన్సర్ ఇదే

పాదయాత్రతో లోకేశ్ కాళ్లు వాచిపోయాయట. బొబ్బలు వచ్చి ఇబ్బంది కరంగా మారాయట. దీంతో హుటాహుటిన డాక్టర్లు లోకేశ్ వద్దకు చేరుకొని.. ఆయనకు ప్రాథమిక వైద్యం చేశారట.

పాదయాత్ర కొన‌సాగింపుపై డాక్టర్ల సూచనకు లోకేశ్ ఆన్సర్ ఇదే
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో పాదయాత్ర సాగుతోంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వద్ద సెల్ఫీలు దిగుతూ.. ప్రతి 100 కిలోమీటర్లకు ఓ కీలకమైన హామీ ఇస్తూ.. లోకేశ్ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు. తొలుత కాస్త తడబడినట్టు కనిపించినా.. రాను రాను లోకేశ్‌ యాత్రకు మద్దతు కనిపిస్తోంది. తెలుగుదేశం శ్రేణులు భారీగానే పాల్గొంటున్నాయి.

ఇక ఇటీవల విడుదలైన ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీకి ఆశాజనకంగా రావడంతో లోకేశ్‌లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉంటే.. పాదయాత్రతో లోకేశ్ కాళ్లు వాచిపోయాయట. బొబ్బలు వచ్చి ఇబ్బంది కరంగా మారాయట. దీంతో హుటాహుటిన డాక్టర్లు లోకేశ్ వద్దకు చేరుకొని.. ఆయనకు ప్రాథమిక వైద్యం చేశారట. లోకేశ్ ను కొద్దిరోజులు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి.. తర్వాత ప్రారంభించాలని కోరారట. అయితే అందుకు లోకేశ్ నిరాకరించారట. తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారట. దీంతో డాక్టర్లు లోకేశ్ కు కొన్ని సలహాలు ఇచ్చారని తెలుస్తోంది.

పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు పాదాలకు లోషన్ రాసుకోవాలని.. షూస్ మార్చాలని సూచించారట. ఎంతో సుకుమారంగా పెరిగిన లోకేశ్ తొలిసారి జనంలోకి వచ్చాడు. ట్రోలింగ్స్, ప్రత్యర్థుల విమర్శలు, తన మీద పడ్డ పప్పు అనే ముద్రను క్రమక్రమంగా తొలగించుకుంటున్నారు. ఈ క్రమంలో పాదయాత్రను ఎంత కష్టమైనా చేస్తున్నారు. అందుకు తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యంగా సోషల్ మీడియా విపరీతమైన కృషి చేస్తోంది.

First Published:  1 April 2023 2:25 AM GMT
Next Story