Telugu Global
Andhra Pradesh

మాది చిన్న ఇల్లు, ప్యాలెస్ కాదు.. జగన్ పై భువనేశ్వరి పంచ్..!

లోకేష్ పాదయాత్రకు బయలుదేరే సమయంలో తాను ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని తెలిపారు భువనేశ్వరి. లోకేష్ యాత్ర చేస్తుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. చివరకు లోకేషే తనకు ధైర్యం చెప్పారని అన్నారు.

మాది చిన్న ఇల్లు, ప్యాలెస్ కాదు.. జగన్ పై భువనేశ్వరి పంచ్..!
X

చంద్రబాబు కుటుంబానికి సడన్ గా కుప్పంపై ప్రేమ ఎక్కువైంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అయిన నారా భువనేశ్వరి స్వయంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆమె కుప్పంలో పర్యటించారు. కుప్పం ప్యాలెస్‌ రోడ్డులో ‘ఎన్టీఆర్‌ సంజీవని’ మెడికల్ క్లినిక్‌, సంచార ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఇకపై క్రమం తప్పకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఇతర సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

లోకేష్ ని తలచుకుని ఏడ్చేశా..

లోకేష్ పాదయాత్రకు బయలుదేరే సమయంలో తాను ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని తెలిపారు భువనేశ్వరి. లోకేష్ యాత్ర చేస్తుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. చివరకు లోకేషే తనకు ధైర్యం చెప్పారని అన్నారు. ఇప్పుడు లోకేష్ యాత్రలో రాటుదేలిపోయారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర పూర్తి చేస్తాడనే నమ్మకం తనకు ఉందన్నారు భువనేశ్వరి.

పొలిటికల్ డైలాగ్స్..

నారా భువనేశ్వరి నుంచి పొలిటికల్ డైలాగులు ఆశించలేం. అయితే కుప్పంలో చంద్రబాబు ఓటమి కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో ఆమె కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయక తప్పలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు భువనేశ్వరి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు ఒడ్డి పోరాడుతోందన్నారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


ఇల్లు మాత్రమే, ప్యాలెస్ కాదు..

కుప్పంలో తాము ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అయిందని చెప్పారు భువనేశ్వరి. ఆ ఇంటి నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. అది చిన్న ఇల్లు మాత్రమేనని, ప్యాలెస్ కాదని సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ ఇంటి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో టీడీపీ నేతలు ప్యాలెస్ అని సంబోధించడం వింటూనే ఉన్నాం. బెంగళూరులో కూడా జగన్ కి ప్యాలెస్ లు ఉన్నాయని విమర్శిస్తుంటారు టీడీపీ నేతలు. ఇప్పుడు భువనేశ్వరి కూడా సందర్భం లేకుండానే తమది ప్యాలెస్ మాత్రం కాదు అని వివరించారు. పరోక్షంగా పంచ్ లు విసిరారు.


First Published:  29 Aug 2023 11:28 AM GMT
Next Story