Telugu Global
Andhra Pradesh

తార‌క‌ర‌త్న కోసం ఒక్క‌రోజు కూడా పాద‌యాత్ర ఆప‌లేక‌పోయారా? - ల‌క్ష్మీపార్వ‌తి విమ‌ర్శ‌

లోకేష్ పాద‌యాత్ర‌పై ల‌క్ష్మీపార్వ‌తి మాట్లాడుతూ ఒక క‌మెడియ‌న్ పాద‌యాత్ర చేస్తే కామెడీ త‌ప్ప మ‌రేమీ ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు. పాద‌యాత్ర‌లో లోకేష్ కామెడీ చూసి అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నార‌ని తెలిపారు.

తార‌క‌ర‌త్న కోసం ఒక్క‌రోజు కూడా పాద‌యాత్ర ఆప‌లేక‌పోయారా? - ల‌క్ష్మీపార్వ‌తి విమ‌ర్శ‌
X

లోకేష్ పాద‌యాత్ర‌కు హాజ‌రైన తార‌క‌ర‌త్న‌కు గుండెపోటు రావ‌డం బాధాక‌ర‌మ‌ని తెలుగు అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్ ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. ప‌ల్నాడులో ఆదివారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఎన్టీఆర్ మ‌న‌వ‌డు తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌రోజు కూడా పాద‌యాత్ర ఆప‌లేదంటే వారి మాన‌వ‌త్వం ఎలాంటిదో ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింద‌న్నారు.

ఈ ఘ‌ట‌న‌ను పెద్ద అప‌శృతిగా ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. మాన‌వ‌త్వం లేని చంద్ర‌బాబు, లోకేష్ స్వభావం చూస్తుంటే అస‌హ్యంగా ఉంద‌న్నారు. లోకేష్ ఈ జ‌న్మ‌లో నాయ‌కుడు కాలేడ‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు, లోకేష్‌ల మీటింగ్ కార‌ణంగా ఎంద‌రో చ‌నిపోతున్నార‌ని, మీరు మ‌నుషుల‌ను చంప‌డానికే వ‌చ్చారా అంటూ వారి ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారని ఆమె తెలిపారు.

లోకేష్ పాద‌యాత్ర‌పై ల‌క్ష్మీపార్వ‌తి మాట్లాడుతూ ఒక క‌మెడియ‌న్ పాద‌యాత్ర చేస్తే కామెడీ త‌ప్ప మ‌రేమీ ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు. పాద‌యాత్ర‌లో లోకేష్ కామెడీ చూసి అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నార‌ని తెలిపారు. లోకేష్ ను ఐర‌న్ లెగ్‌గా ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పారు.

First Published:  30 Jan 2023 1:58 AM GMT
Next Story