Telugu Global
Andhra Pradesh

రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టె ఒకటే- నాగబాబు

పర్యాటక శాఖ మంత్రి అంటే రోజా తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆమె రాష్ర్తమంతా పర్యటిస్తున్నారని, ఆమె పర్యటనలు పక్కనపెట్టి పర్యాటక శాఖపై దృష్టిపెట్టాలంటూ చురకలంటించారు నాగబాబు.

రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టె ఒకటే- నాగబాబు
X

జనసేన నేత, సినీ నటుడు నాగబాబు.. మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోరు మున్సిపాల్టీ కుప్పతొట్టె ఒకటేనన్నారు. మున్సిపాల్టీ కుప్పతొట్టె దగ్గరకు ఎవరూ వెళ్లాలనుకోరని, అందుకే తాము రోజా నోటికి దూరంగా ఉంటూ వచ్చామని చెప్పారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నా ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నామని, పరిధి దాటితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి ముందు మంత్రిగా ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని సూచించారు.

పర్యాటక మంత్రి కాదు, పర్యటనల మంత్రి..

పర్యాటక శాఖ మంత్రి అంటే రోజా తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆమె రాష్ర్తమంతా పర్యటిస్తున్నారని, ఆమె పర్యటనలు పక్కనపెట్టి పర్యాటక శాఖపై దృష్టిపెట్టాలంటూ చురకలంటించారు నాగబాబు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖ పై దృష్టి పెట్టాలని, రాజకీయాలు పక్కనపెట్టి, పాలనను పట్టించుకోవాలన్నారు.


ర్యాంకింగ్స్ లో ఏపీ స్థానమెంత..?

భారత పర్యాటక రంగంలో మొదటి 20 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని గుర్తు చేశారు నాగబాబు. పర్యాటక మంత్రిగా రోజా ఆ రంగాన్ని పట్టించుకుపోవడం వల్లే ఈ దుస్థితి పట్టిందన్నారు. ఇలాగే రోజా పర్యాటక రంగాన్ని గాలికొదిలేస్తే.. చివరకు 20వ స్థానానికి దిగజారుతుందని చెప్పారు. నోటికొచ్చినట్టు పిచ్చపిచ్చగా మాట్లాడొద్దంటూ హెచ్చరించారు నాగబాబు. పిచ్చ పిచ్చగా మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని పట్టించుకోకపోవడం వల్లే దానిపై ఆధారపడ్డ వేలాదిమంది వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై పడ్డారని అన్నారు నాగబాబు. ఇన్నాళ్లూ తాము రోజాని కావాలనే పట్టించుకోలేదని, ఇకనైనా ఆమె బుద్ధి తెచ్చుకుని పద్ధతిగా మాట్లాడాలని సూచించారు.

First Published:  7 Jan 2023 1:46 AM GMT
Next Story