Telugu Global
Andhra Pradesh

బ్లడ్డూ, బ్రీడంటూ బాలయ్య గాలి తీసేసిన నాగబాబు

నాగబాబు సూటిగానే బాలయ్య గాలితీసేశారు. ‘మాటమాటకి బ్లడ్డూ వేరు బ్రీడు వేరంటారు కదా మీ బావ మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని లాక్కున్నపుడు మీరు ఎక్కడున్నారు’ ? అంటూ నిలదీశారు.

బ్లడ్డూ, బ్రీడంటూ బాలయ్య గాలి తీసేసిన నాగబాబు
X

నందమూరి బాలకృష్ణ ఎక్కడ మాట్లాడినా మాటకుముందు ఒకసారి తర్వాత మరోసారి తమ బ్లడ్డూ వేరు తమ బ్రీడు వేరంటూ ఎక్కడ లేని దర్పం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నిజానికి ఎవరిలో అయినా బ్లడ్‌ ఎర్రగానే ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే బ్రీడంటే ఏమిటో బాలయ్యే చెప్పాలి. కానీ బ్లడ్డూ, బ్రీడనే పదాలు పలకటానికి బాగున్నాయనో ఏమో బాలయ్య మాత్రం విపరీతంగా వాడుతుంటారు.

ఇప్పుడా బ్లడ్డూ, బ్రీడనే పదాలను పదే పదే ఎత్తిచూపి బాలకృష్ణ గాలిని నాగబాబు తీసేశారు. సినీ ఫీల్డులో కొంతమందితో మెగా కాంపౌండుకు పడదనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే సాధ్యమైనంత వరకు ఎవరు మరొకరు జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏ స్ధాయిలో వివాదం చెల‌రేగుతోందో అందరు చూస్తున్నదే.

ఈ వివాదంలో తాను తలదూర్చకపోతే జనాలు ఏమన్నా అనుకుంటారని అనుకున్నారో ఏమో వెంటనే ఒక వీడియోను వదిలేశారు నాగ‌బాబు. ఆ వీడియోలో నాగబాబు సూటిగానే బాలయ్య గాలితీసేశారు. 'మాటమాటకి బ్లడ్డూ వేరు బ్రీడు వేరంటారు కదా మీ బావ మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని లాక్కున్నపుడు మీరు ఎక్కడున్నారు' ? అంటూ నిలదీశారు. సక్సెస్ ఫుల్ గా ఉన్న మీ తండ్రిగారిని మీ బావ వెన్నుపోటు పొడిస్తే మీరేం చేశారు ? అని సూటిగా ప్రశ్నించారు. ఆ మహానుభావుడి జీవితాన్ని మీరంతా కలిసి ఏమి చేశారు తప్పుకదా ? అని అడిగారు.

మీ తండ్రిగారికి మీ సొంతబావ వెన్నుపోటు పొడిచినపుడు మీ బ్లడ్డూ, మీ బ్రీడు ఏమైందని ఎద్దేవా చేశారు. కన్నతండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళగురించి మీరేం సమాధానం చెబుతారంటూ గట్టిగానే తగులుకున్నారు. బ్లడ్డూ, బ్రీడంటు నాగబాబుతో పాటు మరికొందరు జనాలు కూడా బాగానే తగులుకుంటున్నారు. మంత్రులు కూడా ఇదే విషయంపై బాలయ్యను కార్నర్ చేస్తున్నారు. మరి నాగబాబు ప్రశ్నలకు బాలయ్య ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

First Published:  27 Sep 2022 8:22 AM GMT
Next Story