Telugu Global
Andhra Pradesh

వె.ధ.వ.సోది!! అంబటికి నాగబాబు కౌంటర్..

సింగిల్ లైన్ సమాధానమే అయినా దీంతో జనసైనికులు ఖుషీ అయిపోయారు. నాగబాబు ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ అంబటికి పదే పదే కౌంటర్లు ఇస్తున్నారు.

వె.ధ.వ.సోది!! అంబటికి నాగబాబు కౌంటర్..
X

ఆమధ్య వారాహి వాహనానికి విపరీతమైన ప్రచారం కల్పించిన వైసీపీ నేతలు, ఇప్పుడు పవన్ కల్యాణ్ పాల్గొన్న అన్ స్టాపబుల్ షో కి కూడా అంతే ప్రచారాన్ని కల్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు, తాజా మంత్రులు ఆ బాధ్యత భుజానికెత్తుకున్నారు. ఆల్రడీ అంబటి రాంబాబు, పేర్ని నాని తమదైన శైలిలో అన్ స్టాపబుల్ షో పై సెటైర్లు పేల్చారు. అన్నయ్య షో కు డుమ్మా, బాలయ్య షో కు జమ్మ.. అంటూ అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ పై ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. పోలవరాన్ని తెరపైకి తెచ్చారు.

'ఏయ్.. ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ.సోది' అంటూ అంబటి ట్వీట్ కి రిప్లై ఇచ్చారు నాగబాబు. సింగిల్ లైన్ సమాధానమే అయినా దీంతో జనసైనికులు ఖుషీ అయిపోయారు. నాగబాబు ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ అంబటికి పదే పదే కౌంటర్లు ఇస్తున్నారు. నాగబాబు తాజాగా ఇచ్చిన రిప్లై అదిరిపోయిందంటూ జనసేన అభిమానులు చురకలంటిస్తున్నారు.


పోలవరంపై మళ్లీ బుక్కయిన అంబటి..

టీడీపీ హయాంలో పోలవరం సాగదీశారు, మా హయాంలో ఎలా పూర్తి చేస్తామో చూడండి అంటూ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు చాలాసార్లు చెప్పారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ పెట్టి మరీ సవాళ్లు విసిరారు. చివరకు ఆయన నాలుక కరచుకుని పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు పోలవరం ఆలస్యంపై అంబటి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పదవి చేపట్టిన తర్వాత పోలవరంపై అంబటి కూడా డెడ్ లైన్లు పెట్టాలనుకున్నారు కానీ, ఆ తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తనకు తెలియదన్నారు. కానీ పోలవరాన్ని మాత్రం ఎప్పటికైనా జగనే ప్రారంభిస్తారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి నాగబాబు రూపంలో అంబటి రాంబాబుకి పోలవరంపై కౌంటర్ పడింది.

First Published:  28 Dec 2022 5:24 AM GMT
Next Story