Telugu Global
Andhra Pradesh

కేసులను మడిచి..- మళ్లీ ఫ్రస్టేట్‌ అయిన జేసీ..

ప్రజలే తిరగబడి యూనిఫాం మీద ఉండే స్టార్లను పీకేసి పరిగెత్తించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మున్ముందు ఎలా ఉంటుందో డీఎస్పీ చైతన్యకు చూపిస్తామన్నారు. దమ్మున్న వాడు ఎవరో తన మీదకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం తిప్పి సవాల్ చేశారు.

కేసులను మడిచి..- మళ్లీ ఫ్రస్టేట్‌ అయిన జేసీ..
X

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్సెస్‌ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్యగా వివాదం ముదురుతోంది. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఇద్దరూ పబ్లిక్‌గానే వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారు. పంచె ఊడదీసి కొడుతా అని జేసీ ప్రభాకర్ రెడ్డి అనగా.. నీ ఇంటికి వచ్చా.. నీ బెడ్‌రూంలోకి కూడా వస్తానంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఇంతలో ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐ-టీడీపీ తాడిపత్రి అధ్యక్షుడు గండికోట కార్తీక్‌పై గత అర్ధ‌రాత్రి దాడి జరిగింది. రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాచి కత్తులతో, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా సమావేశం పెట్టి ఫైర్ అయ్యారు.

తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీని ఉద్దేశించి.. ``నువ్వు మహా అయితే మమ్మల్ని జైలుకు పంపుతావ్.. ఓరేయ్‌ అదే నీ ఉద్యోగం పోతే ఏమవుతావ్ రా..?. రేయ్ చైతన్య .. ఏం చేస్తావ్‌ రా ?'' అంటూ ఫైర్ అయ్యారు. డీఎస్పీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇకపై ఫిర్యాదులు కూడా చేయదలుచుకోలేదన్నారు. పోలీసుల మీద తమకు నమ్మకమే లేదన్నారు. ''ఓరేయ్‌ పోలీస్‌.. మీ మీద, మీ వ్యవస్థ మీద నమ్మకమే పోయిందిరా!'' అంటూ మాట్లాడారు.

ప్రజలే తిరగబడి యూనిఫాం మీద ఉండే స్టార్లను పీకేసి పరిగెత్తించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మున్ముందు ఎలా ఉంటుందో డీఎస్పీ చైతన్యకు చూపిస్తామన్నారు. దమ్మున్న వాడు ఎవరో తన మీదకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం తిప్పి సవాల్ చేశారు. అవినాష్‌ రెడ్డిని సీబీఐ పిలవగానే జగన్ ఢిల్లీ వెళ్తున్నాడని.. తాము అలా కూడా వెళ్లే వాళ్లం కాదన్నారు. ఇక్కడే ఉంటాం.. ఎవరికీ తలవంచేది లేదన్నారు. దాడులు జరిగినా ఫిర్యాదు చేసినా వృథా అనే పరిస్థితిని తాడిపత్రిలో డీఎస్పీ తెచ్చినా.. ఎస్పీ, డీఐజీ ఏం చేస్తున్నారని జేసీ ప్రశ్నించారు. తాము చేస్తున్న ఫిర్యాదులతో ఏమవుతుందని డీఎస్పీ అంటున్నారని.. డీఎస్పీ మాపై పెట్టే కేసులను కూడా ఆయన మడిచి కిందపెట్టుకోవాల్సిందేనన్నారు.

First Published:  30 Jan 2023 9:17 AM GMT
Next Story