Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్.. పై నుంచి కోడెల పిలుస్తున్నాడా అంటూ..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషయంలో ఆయన ఘాటైన ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన మరింత ఘాటుగా పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్.. పై నుంచి కోడెల పిలుస్తున్నాడా అంటూ..
X

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు ఒక్కోసారి తీవ్రమైన చర్చకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ను ఉద్దేశించి సాయిరెడ్డి చేసే ట్వీట్లు సంచలనం రేపుతుంటాయి. సాయిరెడ్డి పెట్టే ట్వీట్లకు అంతే ఘాటుగా తెలుగు దేశం పార్టీ స్పందిస్తుంటుంది. అయినా సరే విజయసాయి రెడ్డి మాత్రం తన శైలిని మార్చుకోరు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషయంలో ఆయన ఘాటైన ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి మరింత ఘాటుగా పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

కర్నూలు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎలక్షన్లే తన జీవితంలో చివరి ఎన్నికలని, తనను గెలిపించాలని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వీటిని ఆధారంగా చేసుకొని సాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నైరాశ్యంలో కూరుకొని పోయాడని.. ఇంట్లో కట్టేయండని హితవు పలికారు. పై నుంచి కోడెల పిలుస్తున్నాడా? అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు.

'నైరాశ్యంతో పోయేట్టున్నాడు మా చంద్రం అన్నయ్య. నాలుగు రోజులు కట్టేసైనా ఇల్లు కదలకుండా చేయండయ్యా! కుప్పం ప్రజలు తరిమికొట్టినప్పుడే లాస్ట్ ఎలక్షన్ అని అర్థమైంది. మనకు మళ్లీ ఈ ఏడుపులేంటి అన్నయ్యా? పైనుంచి కోడెల గాని పిలుస్తున్నాడా?' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో చంద్రబాబును టూరిస్టుగా అభివర్ణించారు. పది రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చి పోయే టూరిస్టువి, నీకు గెలుపోటములతో పనేంటని ప్రశ్నించారు. నువ్వు దోచుకున్న డబ్బును ముందు కుటుంబ సభ్యులకు పంచెయ్ అని హితవు పలికారు. ఆ ట్వీట్‌లో విజయ సాయి రెడ్డి 'అన్నయ్యా!...పది రోజులకోసారి రాష్ట్రానికి వచ్చిపోయే టూరిస్టువి. మనకు గెలుపు ఓటములతో పనేంటి కానీ ఐదు లక్షల కోట్లు దోచుకున్నావు కదా! విదేశీ బ్యాంకుల్లో నీ డబ్బే కుప్పలుగా పడి ఉందంట. నీకు లాస్టులు, ఫస్టులేమిటి కామెడీ కాకపోతే. మన కుటుంబంలో ఎవరి వాటా వాళ్ళకిచ్చేయ్ అన్నయ్యా!'అని రాసుకొచ్చారు. ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

First Published:  18 Nov 2022 8:53 AM GMT
Next Story