Telugu Global
Andhra Pradesh

భార‌తి పుట్టిన‌రోజున పాలు పొంగిస్తే.. కానుక‌గా ఇచ్చిన‌ట్లేనా?

రుషికొండ మీద నిర్మించినవన్నీ ప్రభుత్వ భవనాలని అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భవనాలను జగన్ తన భార్య భారతికి ఎలా బహుమతిగా ఇవ్వగలరు?

భార‌తి పుట్టిన‌రోజున పాలు పొంగిస్తే.. కానుక‌గా ఇచ్చిన‌ట్లేనా?
X

వైసీపీ రెబ‌ల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిచ్చి పీక్స్‌కు చేరుకున్నట్లే ఉంది. ఢిల్లీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వంపైన కూడా ప్రతిరోజు బురదచల్లేస్తున్నారు. తాజాగా ఆయన ఏమన్నారంటే రుషికొండపై కొత్తగా రూ.450 కోట్లతో నిర్మించిన మహల్‌ను భార్య భారతికి జగన్ కానుకగా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అందుకనే ఆమె పుట్టినరోజు డిసెంబర్ 8న పాలు పొంగించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇక్కడే జగన్ అంటే రాజులో ఎంతటి ధ్వేషం పేరుకుపోయిందో అర్థ‌మవుతోంది.

రుషికొండ మీద నిర్మించినవన్నీ ప్రభుత్వ భవనాలని అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భవనాలను జగన్ తన భార్య భారతికి ఎలా బహుమతిగా ఇవ్వగలరు? ఇక భారతి పుట్టినరోజున భవనంలో జగన్ పాలు పొంగిస్తే తప్పేమిటి? కొత్త భవనంలోకి వెళ్ళేముందు ఎవరైనా మంచిరోజును చూసుకునే కదా ప్రవేశించేది. భారతి పుట్టినరోజు డిసెంబర్ 8వ తేదీ మంచిదని జగన్ అనుకునున్నారేమో. అంతమాత్రాన ప్రభుత్వ భవనాన్ని భారతికి కానుకగా ఇచ్చేయగలరా? పిచ్చి పీక్స్ కు చేరుకుంటేనే ఇలాంటి మాటలు మాట్లడగలరు.

ప్రభుత్వ పెద్దల అక్రమాలకు వంతపాడుతున్న వాళ్ళంతా తిరిగి తమ మాతృసంస్థ‌లకు లేదా కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్ళిపోవాలని అనుకుంటున్నారట. అలా వెళ్ళిపోయిన వాళ్ళందరు ఎక్కడున్నా పట్టుకుని శిక్షించటం తప్పదని ఎంపీ బెదిరించటమే విచిత్రంగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కేంద్రానికి వెళ్ళేందుకు దరఖాస్తులు చేసుకున్నారట. గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్, ప్రస్తుత చీఫ్ సంజయ్, సునీల్ నాయక్ లాంటి వాళ్ళందరికీ శిక్షలు తప్పవని ఎంపీ వార్నింగులివ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

వీళ్ళంతా తమ పేరంట్ డిపార్ట్ మెంట్లకు వెళ్ళిపోవాలని దరఖాస్తులు చేసుకుంటున్నారంటే వైసీపీ ఓడిపోతుందని ఖాయమైపోయిందని ఎంపీ తేల్చేశారు. సునీల్ కుమార్‌ను ఏకంగా పదేళ్ళపాటు జైల్లో పెట్టిస్తానని ఎంపీ శపథం చేశారు. అంటే సునీల్ ‘దెబ్బ’ ఎంపీపైన ఏ స్థాయిలో పడిందో అర్థ‌మైపోతోంది.


First Published:  28 Nov 2023 6:19 AM GMT
Next Story