Telugu Global
Andhra Pradesh

తిరుగుబాటు ఎంపీ బంపరాఫర్

తనకులాగే సీఐడీ వేధింపులపైన కోర్టుల్లో కేసులు వేయాలని అనుకుంటే వాళ్ళ లాయర్ ఖర్చులంతా తానే భరిస్తానంటు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తిరుగుబాటు ఎంపీ బంపరాఫర్
X

న్యాయస్ధానాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దామని ప్రయత్నించి భంగపడుతున్న నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు జనాలకు బంపరాఫర్ ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ బాధితులందరు కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేయాలని పిలుపిచ్చారు. సీఐడీ వేధింపులకు వ్యతిరేకంగా తాను కోర్టులో పోరాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. తనకులాగే సీఐడీ వేధింపులపైన కోర్టుల్లో కేసులు వేయాలని అనుకుంటే వాళ్ళ లాయర్ ఖర్చులంతా తానే భరిస్తానంటు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్‌కు వ్యతిరేకంగా తాను ఎంత పోరాటం చేస్తున్నా ఉపయోగం కనబడటం లేదని ఎంపీకి అర్ధమైపోయింది. జగన్‌కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టని, ఏసీబీ కోర్టని, హైకోర్టు చివరకు సుప్రిం కోర్టుల్లో కూడా చాలా కేసులు వేశారు. ఎలాగైనా జగన్ బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలన్నది రఘురాజు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ఎంపీ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

First Published:  6 Nov 2022 8:51 AM GMT
Next Story