Telugu Global
Andhra Pradesh

పవన్‌కు మోడీ ప్రభుత్వం షాకిచ్చిందా?

ఒకవైపు అవినీతి జరిగిపోతోందంటు జనసేన ఏ పథకంపైన అయితే గోల చేస్తోందో ఇంకో వైపు అదే పథకం దేశానికే ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభినందించటం పవన్‌కు షాకనే చెప్పాలి.

పవన్‌కు మోడీ ప్రభుత్వం షాకిచ్చిందా?
X

పవన్‌కు మోడీ ప్రభుత్వం షాకిచ్చిందా?

ఏపీలో మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. జగనన్న ఇళ్ళు లబ్దిదారులకు కనీళ్ళు అనే కార్యక్రమాన్ని పవన్ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణాల పేరుతో భారీగా అవినీతి జరిగిందని, లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆరోపణల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతలు ఇదే కార్యక్రమంగా తీసుకున్నారు. దీంతో చాలాచోట్ల జనసేన నేతలకు, ఇళ్ళ లబ్దిదారులకు మధ్య పెద్ద గొడవలవుతున్నాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే జగనన్న ఇళ్ళ నిర్మాణం భేష్ అంటూ కేంద్రం ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఏపీలో జరుగుతున్న జగనన్న ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని యావత్ దేశం ఒక రోల్ మోడల్‌గా తీసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు పిలుపిచ్చింది. కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ జగనన్న ఇళ్ళ నిర్మాణాలను అభినందిస్తు ఏపీ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజైయ్ జైన్‌కు సందేశం పంపారు.

పేదలందరికీ సొంతిళ్ళుండాలనే జగన్ సంకల్పం, ప్రయత్నం ఎంతో అభినందనీయమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు ఏపీలో పర్యటించి ఇళ్ళ నిర్మాణాల విధివిధానాలను పరిశీలించి అమలు చేయాలన్నట్లుగా మిగిలిన రాష్ట్రాలకు పిలుపిచ్చారు. అందరికీ ఇళ్ళు అనే పథకంలో జగన్ 31 లక్షల మందికి పట్టాలు పంచారు. అలాగే 21 లక్షల ఇళ్ళు నిర్మించేందుకు ప్లాన్ చేశారు. మొదటి దశలో మొదలైన 15 లక్షల ఇళ్ళ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

ఈ నిర్మాణాలకు దశలవారీగా ప్రభుత్వం రూ.56 వేల కోట్లు ఖర్చుచేస్తోంది. ఇంత భారీ ఎత్తున చేపట్టిన నిర్మాణాల్లో అక్కడక్కడ పొరబాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ పొరబాట్లనే పవన్ బాగా హైలైట్ చేస్తు గోల చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ పొరబాట్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, కాన్సెప్టును మాత్రమే పరిగణలోకి తీసుకున్నది. అందుకనే ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపిచ్చింది. ఒకవైపు అవినీతి జరిగిపోతోందంటు జనసేన ఏ పథకంపైన అయితే గోల చేస్తోందో ఇంకో వైపు అదే పథకం దేశానికే ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభినందించటం పవన్‌కు షాకనే చెప్పాలి.

First Published:  16 Nov 2022 6:00 AM GMT
Next Story