Telugu Global
Andhra Pradesh

వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా.. త్వ‌ర‌లో టీడీపీలోకి!

2019 ఎన్నిక‌ల్లో అప్ప‌టి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి న‌వీన్ నిశ్చ‌ల్‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ జ‌గ‌న్ ఆయ‌న‌కు హిందూపురం అసెంబ్లీ టికెటిచ్చారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.

వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా.. త్వ‌ర‌లో టీడీపీలోకి!
X

అనంత‌పురం జిల్లాలో వైసీపీకి షాక్ త‌గిలింది. ఎమ్మెల్సీ ప‌ద‌వికి, వైసీపీకి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం ఇక్బాల్ ఫ్యాక్స్‌తో పాటు ఈ-మెయిల్ పంపించారు. మ‌రో మూడేళ్లు (2027 మార్చి వరకు) ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌కు విజ్జప్తి చేశారు. వారం రోజుల్లో ఆయ‌న టీడీపీలో ఆయన చేరనున్నట్లు స‌మాచారం.

బాల‌కృష్ణ‌పై పోటీ చేసి ఓడిపోయారు

ఐపీఎస్ అధికారి అయిన ఇక్బాల్ రాయ‌ల‌సీమ ఐజీగా ప‌నిచేశారు. రాజ‌కీయాల‌పై ఆస‌క్తితో వైసీపీలో చేరారు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో అప్ప‌టి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి న‌వీన్ నిశ్చ‌ల్‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ జ‌గ‌న్ ఆయ‌న‌కు హిందూపురం అసెంబ్లీ టికెటిచ్చారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత కూడా జ‌గ‌న్ ఆయ‌న్ను ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌర‌వించారు. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానూ నియమించారు.

దీపికను ఇన్‌ఛార్జిగా తీసుకురావ‌డంతో కినుక‌

కొన్ని రోజుల కింద‌ట దీపిక అనే మ‌హిళ‌కు హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిగా బాధ్య‌తలు జ‌గ‌న్ అప్ప‌గించారు. ఈ ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఆమెకే ఇచ్చారు. దీంతో కినుక వ‌హించిన ఇక్బాల్ పార్టీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

First Published:  5 April 2024 2:28 PM GMT
Next Story