Telugu Global
Andhra Pradesh

నేనొస్తున్నా.. మ‌న స‌త్తా చూపిద్దాం!

16 నెల‌లు జైలులో ఉండి వ‌చ్చిన జ‌గ‌న్‌.. చంద్ర‌బాబును 16 రోజులైనా జైలులో పెట్టాల‌ని కుట్ర చేస్తున్నార‌ని బాల‌కృష్ణ ఆరోపించారు. చంద్ర‌బాబు క‌డిగిన ముత్యంలా బ‌య‌టికి వ‌స్తార‌ని, ఇలాంటివి ఎన్నో చూశామ‌ని ఆయ‌న చెప్పారు.

నేనొస్తున్నా.. మ‌న స‌త్తా చూపిద్దాం!
X

కేవ‌లం క‌క్ష సాధింపుతోనే ఎలాంటి ఆధారాలూ లేకుండా టీడీపీ అధినేత చంద్ర‌బాబును అరెస్ట్ చేశార‌ని ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం కేవలం పాలసీ మేకర్ అని.. అధికారులే అమలు చేస్తారని ఆయ‌న చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్ర‌శ్నించారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమ‌ర్శించారు.

16 నెల‌లు జైలులో ఉండి వ‌చ్చిన జ‌గ‌న్‌.. చంద్ర‌బాబును 16 రోజులైనా జైలులో పెట్టాల‌ని కుట్ర చేస్తున్నార‌ని బాల‌కృష్ణ ఆరోపించారు. చంద్ర‌బాబు క‌డిగిన ముత్యంలా బ‌య‌టికి వ‌స్తార‌ని, ఇలాంటివి ఎన్నో చూశామ‌ని ఆయ‌న చెప్పారు. న్యాయ పోరాటం చేస్తామ‌ని తెలిపారు. నేనొస్తున్నా.. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు.. తెలుగువాడి స‌త్తా, పౌరుషాన్ని చూపెడ‌దాం అని బాల‌కృష్ణ అన్నారు.

First Published:  12 Sep 2023 7:27 AM GMT
Next Story