Telugu Global
Andhra Pradesh

1 లక్షా 60 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి `దీపావళి కానుక`

గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రధాన పండుగలైన వినాయక చవితి, దీపావళి, సంక్రాంతికి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏదో ఒక కానుకను అందించే సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తున్నారని టీటీడీ ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి కొనియాడారు.

1 లక్షా 60 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి `దీపావళి కానుక`
X

చంద్రగిరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. అండగా నిలుస్తూ.. దేనికైనా నేనున్నానని భరోసా కల్పించే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు `దీపావళి కానుక`ను అందించి కుటుంబ పెద్దగా నిలిచారు. 1 లక్షా 60 వేల కుటుంబాలకు అందించే ఎమ్మెల్యే చెవిరెడ్డి `దీపావళి కానుక` కార్యక్రమం శుక్రవారం ముక్కోటి సమీపంలోని నారాయణి గార్డెన్స్ లో జరిగింది. టీటీడీ ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి `దీపావళి కానుక` కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్రతి నిత్యం ప్రజలకు సేవ చేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు వలంటీర్లకు దీపావళి కానుకను మొదటగా అందజేశారు.


ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు మరింత ఆనందకర జీవనాన్ని గడపాలన్నారు. దీపావళి పండుగను మరింత సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 1 లక్షా 60 వేల కుటుంబాలకు స్వీట్లు, కారాసెవ్‌తో పాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న గ్రీటింగ్ కార్డును అందించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రధాన పండుగలైన వినాయక చవితి, దీపావళి, సంక్రాంతికి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏదో ఒక కానుకను అందించే సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఇలా చేరువ అవడంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డిని ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమవుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కులాలకు అతీతంగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాదాలకు దూరంగా జాగ్రత్తలు పాటిస్తూ బాణసంచా కల్చాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

First Published:  22 Oct 2022 2:12 AM GMT
Next Story