Telugu Global
Andhra Pradesh

సొంతగూటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి..?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని జగన్ నిర్ణయించడంతో అసంతృప్తికి గురైన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

సొంతగూటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి..?
X

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి సొంత గూటికి వెళ్లబోతున్నారా..? అవును ఇప్పుడు ఇదే చర్చ సోషల్‌మీడియాలో జరుగుతోంది. ఇవాళ లేదా రేపు వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జగన్‌తో ఆళ్ల సమావేశమవుతారని తెలుస్తోంది.

ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్‌లో చర్చలు జరిపారని సమాచారం. విజయసాయిరెడ్డి నచ్చచెప్పడంతో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల అంగీకరించారని తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని జగన్ నిర్ణయించడంతో అసంతృప్తికి గురైన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే కొద్ది రోజులుగా ఆ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఆళ్ల.. తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు అంగీకరించారని సమాచారం.

First Published:  20 Feb 2024 5:51 AM GMT
Next Story