Telugu Global
Andhra Pradesh

వారు అబద్ధానికి నిజరూపాలు..

ఏపీలో నిర్వహించనున్న కులగణన దేశంలో చరిత్ర సృష్టిస్తుందని మంత్రి చెప్పారు. తాము కులగణన చేస్తామని ప్రకటించిన తర్వాత టీడీపీ వారికి కూసాలు కదిలి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని చెప్పారు.

వారు అబద్ధానికి నిజరూపాలు..
X

చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్‌ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ.. అబద్ధానికి నిజ రూపాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లోమీడియాలో వచ్చేవన్నీ అబద్దాలే తప్ప వార్తలు కాదన్నారు. చంద్రబాబు అబద్ధం అనే ఆస్తిని అందరికీ పంచాలనుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఈరోజు మళ్లీ ఆయనకే దండ‌లేసి దండాలు పెడుతున్నారన్నారు.

ఏపీలో నిర్వహించనున్న కులగణన దేశంలో చరిత్ర సృష్టిస్తుందని మంత్రి చెప్పారు. తాము కులగణన చేస్తామని ప్రకటించిన తర్వాత టీడీపీ వారికి కూసాలు కదిలి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని చెప్పారు. వలంటీర్లు ఈ కులగణనలో పాల్గొనకూడదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, అసలు వలంటీర్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని తెలిపారు. కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్‌ సమావేశాలు పెడుతున్నాం. ఈ నెల 27 నుంచి కులగణన చేయాలనుకున్నామని.. కానీ, మరికొద్ది రోజులు వాయిదా వేసి డిసెంబర్‌ 10 నుంచి కుల గణన చేప‌డ‌తామ‌ని వివరించారు. కిందిస్థాయి నుంచి వచ్చే అందరి సూచనలూ తెలుసుకుంటున్నందున పది రోజులు ఆలస్యం అవుతోందని చెప్పారు. బిహార్‌లో చేసిన కులగణనను పరిశీలించామని, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.

కులాలవారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు..? వారి జీవన స్థితి ఎలా ఉందని తేల్చాలని చాలాకాలంగా డిమాండ్ ఉంద‌న్నారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంట్‌లో సీఎం జ‌గ‌న్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని వివరించారు. మహిళలకు సగం రిజర్వేషన్‌ కల్పించారని గుర్తుచేశారు. సోషల్‌ జస్టిస్‌ ఆచరించటంలో సీఎం జగన్‌ విజయం సాధించారని మంత్రి తెలిపారు.

First Published:  24 Nov 2023 12:38 PM GMT
Next Story