Telugu Global
Andhra Pradesh

ఒక పార్టీ అధ్య‌క్షుడు మ‌రో పార్టీకి ఊడిగం చేయ‌డం ఎక్క‌డా లేదు

పవన్ ప్యాకేజీలు తీసుకుని హాయిగా ఉంటారని, పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దామని చూసే సైనికులకే ఇబ్బంది వస్తోందని ఆయ‌న చెప్పారు.

ఒక పార్టీ అధ్య‌క్షుడు మ‌రో పార్టీకి ఊడిగం చేయ‌డం ఎక్క‌డా లేదు
X


దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి మరో పార్టీకి ఊడిగం చేసిన చరిత్ర ఎక్కడా లేదని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో చంద్ర‌బాబును సీఐడీ అరెస్టు చేస్తే.. విజ‌య‌వాడ చేరుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్ని ఆప‌సోపాలు ప‌డ్డారో ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రీ ఇంత‌లా టీడీపీకి స‌రెండర్ అయిపోతున్న తీరు చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఇక పార్టీ మూసుకోవడం ఉత్తమమని మంత్రి సూచించారు. ఇదే పవన్ కళ్యాణ్ 2018లో టీడీపీ అవినీతి ప్రభుత్వం అని ఆరోపించ లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్పుడు నాలుక మ‌డ‌తేసి.. అవినీతి కేసుల్లో అరెస్ట‌యి రిమాండ్ ఖైదీగా ఉన్న బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కంటే దారుణం ఉండ‌ద‌ని అని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు నిల‌దీశారు. జనసైనికుల మనోభావాలను ఒక్కసారి పవన్ గమనించాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా సూచించారు.

తాము ఎంత‌సేపూ టీడీపీ జెండాను మోసి.. వారి అజెండాను అమ‌లు చేస్తామ‌ని జ‌న‌సైనికులు అంటున్నార‌ని మంత్రి ప‌వ‌న్ కి వివ‌రించారు. పవన్ ప్యాకేజీలు తీసుకుని హాయిగా ఉంటారని, పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దామని చూసే సైనికులకే ఇబ్బంది వస్తోందని ఆయ‌న చెప్పారు. ప‌వ‌న్ అస‌లు రాజ‌కీయాల‌కు సూట్ కార‌ని మంత్రి తేల్చి చెప్పారు. మీ అన్న గారు చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఎలా విలీనం చేశారో అలా మీరు కూడా ఒక తోవ చూసుకోండని సలహా ఇచ్చారు. లేదా జనసేనను పూర్తిగా మూసేసి మీరు సినిమాలు తీసుకోవడం బెటర్ అని మంత్రి సలహా ఇచ్చారు.

First Published:  12 Sep 2023 4:30 AM GMT
Next Story