Telugu Global
Andhra Pradesh

ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు..

మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల స్పందన వేరు, రోజా స్పందన వేరు అనేట్టుగా ఉంది. రోజా పూర్తిగా సినిమా స్టైల్ లో బాలయ్యకు బదులిచ్చారు.

ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు..
X

"ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.." బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఆ తర్వాత చాలామంది ఈ డైలాగ్ ని కాపీ కొట్టారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ కూడా ఈ డైలాగ్ కొట్టారు. అయితే ఇప్పుడు దీన్ని బాలయ్యకే కౌంటర్ గా వాడారు మంత్రి రోజా. "ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగనన్న ముందు కాదు" అంటూ ట్విట్టర్లో సెటైర్ పేల్చారు రోజా.

వర్సిటీ వ్యవహారంలో డైలాగ్ వార్..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీలో రాజకీయ సెగలు పొగలు రేపుతోంది. పేరు మార్పు వ్యవహారంపై బాలయ్య సీరియస్ గా స్పందించారు. దీనికి వైసీపీ నుంచి కూడా గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. మంత్రులంతా బాలయ్యపై ఘాటుగా స్పందించారు. జోకర్ బాలయ్య అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో రిప్ల‌య్ ఇచ్చారు. మరో మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బాలయ్యను ఉతికి ఆరేశారు. ఇప్పుడు మంత్రి రోజా లైన్లోకి వచ్చారు. బాలయ్యకు సినిమా స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.

దబిడ దిబిడే..

మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల స్పందన వేరు, రోజా స్పందన వేరు అనేట్టుగా ఉంది. రోజా పూర్తిగా సినిమా స్టైల్ లో బాలయ్యకు బదులిచ్చారు. అది కూడా ఆయన సినిమా డైలాగులనే వాడుకుంటూ ఆటాడేసుకున్నారు. 'బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే..!!' అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో రోజా కామెంట్లు వైరల్ గా మారాయి. వైసీపీ మంత్రుల ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

First Published:  25 Sep 2022 4:32 AM GMT
Next Story