Telugu Global
Andhra Pradesh

పిచ్చి కల్యాణ్, పళ్లు రాలగొడతా జాగ్రత్త.. రోజా వార్నింగ్

పవన్ కల్యాణ్ పక్క పార్టీల జెండాలు మోసే కూలీ అని కౌంటర్ ఇచ్చారు రోజా. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్‌, తనను నమ్మిన అభిమానుల్ని మోసం చేశారని మండిపడ్డారు.

పిచ్చి కల్యాణ్, పళ్లు రాలగొడతా జాగ్రత్త.. రోజా వార్నింగ్
X

సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ కి పిచ్చి ముదిరిందని, పీకే అంటే అర్థం పిచ్చి కల్యాణ్ అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఆరోగ్యశ్రీ ద్వారా పవన్ పిచ్చికి వైద్యం చేయిస్తామన్నారు. అవాకులు చెవాకులు పేలితే పవన్ అయినా, ఇంకెవరైనా పళ్లు రాలగొడతానని హెచ్చరించారామె. జనసేన మీటింగ్ లో పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రోజా. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి, సీఎం జగన్ ని విమర్శించడమా అని అన్నారామె.

జెండా కూలీ..

పవన్ కల్యాణ్ పక్క పార్టీల జెండాలు మోసే కూలీ అని కౌంటర్ ఇచ్చారు రోజా. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్‌, తనను నమ్మిన అభిమానుల్ని మోసం చేశారని మండిపడ్డారు. జైలులో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ధ్వజమెత్తారు. తన తల్లిని తిట్టిన వ్యక్తితో పవన్ పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీగా 5 లక్షల రికార్డు పైగా మెజార్టీతో గెలిచిన నాయకుడు జగన్ అని గుర్తు చేశారు రోజా. జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓడిపోయారన్నారు. పవన్ తన స్థాయికి తగినట్టు మాట్లాడితే బాగుంటుందన్నారు. యుద్దానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే ఉన్నారని చెప్పారు రోజా. సింహంలా జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని చెప్పారు. కనీసం జనసేనకి 10 సీట్లలో అయినా పోటీ చేసే అభ్యర్థులున్నారా అని ప్రశ్నించారు రోజా.

అమ్మా బ్రాహ్మణీ..!

స్కిల్ స్కామ్ గురించి అసలు బ్రాహ్మణికి ఏం తెలుసని ప్రశ్నించారు మంత్రి రోజా. చంద్రబాబు సంతకాలు పెట్టారో లేదో సీఐడీ ఆఫీసుకు వెళితే చూపిస్తారన్నారు. అచ్చెన్నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ని బ్రాహ్మణి చదువుతున్నారని సెటైర్లు పేల్చారు. సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ అని చెప్పారు రోజా. దొంగ చెప్పే మాటలు ఎవరు పట్టించుకుంటారన్నారు. అసలు సీమన్స్ సంస్థకు ఆయన మాజీ ఎండీ ఎందుకయ్యారో తెలుసా అని ప్రశ్నించారు. తప్పుడు పనుల్ని చేస్తేనే ఆయన్ను తీసి పక్కనపెట్టారన్నారు రోజా.

First Published:  17 Sep 2023 12:08 PM GMT
Next Story