Telugu Global
Andhra Pradesh

పాతరేస్తారు బాబూ జాగ్రత్త.. రోజా వార్నింగ్

ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్నారు.

పాతరేస్తారు బాబూ జాగ్రత్త.. రోజా వార్నింగ్
X

రాజధాని ప్రాంతంలో పేదలు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారా..? వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో జనం చంద్రబాబుని, టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆర్-5 జోన్‌ లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ సైతం సమర్ధించిందని మంత్రి రోజా గుర్తుచేశారు.

ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. పేదలను చూస్తే చంద్రబాబుకు జాలి లేదని, అహంకారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి రోజా. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. వాలంటీర్లను ప్రజలంతా మెచ్చుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు తాము ఇళ్లు కూడా నిర్మించి ఇస్తున్నామని చెప్పారు.

First Published:  20 May 2023 2:02 PM GMT
Next Story