Telugu Global
Andhra Pradesh

ఫ్లూటు జింక ముందు ఊదు.. బాలకృష్ణకు రోజా కౌంటర్

అసెంబ్లీ అంటే దేవాలయం అని, బీసీ స్పీకర్ పైకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లడమేంటని నిలదీశారు మంత్రి రోజా. అసెంబ్లీలో దౌర్జన్యాలు, రౌడీయిజాలు మంచివి కావన్నారు.

ఫ్లూటు జింక ముందు ఊదు.. బాలకృష్ణకు రోజా కౌంటర్
X

మేకప్ వేసుకుని, సినిమా షూటింగ్ లకు వెళ్లే బాలకృష్ణ అసలు ఏనాడైనా అసెంబ్లీకి వచ్చారా, వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని నిలదీశారు మంత్రి రోజా. సినిమా ఫంక్షన్లలో ఆడపిల్లలు కనపడితే ముద్దు పెట్టండి, లేదా కడుపు చేయండి అంటూ గౌరవం లేకుండా మాట్లాడే బాలకృష్ణ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి తొడగొట్టడమేంటని మండిపడ్డారు. ఏనాడూ నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదన్నారు. ఫ్లూటు జింకముందు ఊడాలని, సింహం లాంటి సీఎం జగన్ ముందు కాదని బాలకృష్ణని హెచ్చరించారు రోజా.

గజదొంగకు సపోర్టా..?

అసెంబ్లీ అంటే దేవాలయం అని, బీసీ స్పీకర్ పైకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లడమేంటని నిలదీశారు మంత్రి రోజా. అసెంబ్లీలో దౌర్జన్యాలు, రౌడీయిజాలు మంచివి కావన్నారు. "మీరుండేది 23మంది, మేము 151మంది.. మీలాగే శాసన సభపై మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఓసారి ఆలోచించండి.ఇలాగే హద్దుమీరితే వదిలిపెట్టేది లేదు." అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు రోజా. చంద్రబాబు పెద్ద గజదొంగ అని, ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేశారని, ఇప్పుడు దొరికిపోయారని ఎద్దేవా చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సైకోల్లాగా గొడవ చేశారని మండిపడ్డారు రోజా. స్పీకర్ ముందున్న పుస్తకాలు పడేసి, మానిటర్ పగలగొట్టి.. ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారని నిలదీశారు. బావ కళ్లలో ఆనందం చూడటానికే బాలకృష్ణ మీసం తిప్పి, తొడ కొట్టారని అన్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులేయించినప్పుడు.. బాలకృష్ణ ఇలాంటి పని చేసి ఉంటే ప్రజలు హర్షించేవారన్నారు. గజదొంగ చంద్రబాబు కోసం బాలకృష్ణ ఇలా చేయడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు రోజా.


First Published:  21 Sep 2023 11:17 AM GMT
Next Story