Telugu Global
Andhra Pradesh

గాడిదకేం తెలుసు.. నాగబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు

నాగబాబు వెటకారాలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుసు గంధపు వాసన అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

గాడిదకేం తెలుసు.. నాగబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు
X

గాడిదకేం తెలుసు.. నాగబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు

జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కంబైన్డ్ గా ఎంతలా పగలబడి నవ్వేవారో.. ఇప్పుడు రాజకీయాల్లో అంతలా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు మంత్రి రోజా, జనసేన నేత నాగబాబు. ఇద్దరూ ఏమాత్రం తగ్గడంలేదు. ఓ దశలో వీరి వ్యాఖ్యలు మరీ శృతిమించిపోతున్నాయి. వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. తాజాగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకం వీరిమధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. నాగబాబు వెటకారాలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుసు గంధపు వాసన అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

అసలేం జరిగింది..?

మంత్రి రోజా నగరి నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ ఫొటోని ట్వీట్ చేస్తూ నాగబాబు ఆమెపై సెటైర్ వేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రారంభించిన రోజా.. అంటూ కామెంట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని వెటకారం చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి కారణం ఎవరంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు నాగబాబు. ఆ ట్రోలింగ్ కంటే మంత్రి రోజా ఇచ్చిన కౌంటర్ మరింత ఘాటుగా ఉంది.

“ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సుదూర ప్రాంతం నుండి పైప్ లైన్ లాగి తాగునీటినిచ్చాము. @NagaBabuOffl గాడిదకేమి తెలుసు గంధపు వాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా, ఆ గ్రామానికి వెళ్ళి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం!” అంటూ ట్వీట్ చేశారు రోజా.



దీంతో నాగబాబు బ్యాచ్ కి కూడా ఎక్కడో కాలింది. వెంటనే జనసేన నుంచి కూడా రోజాపై కౌంటర్లు పడ్డాయి. గాడిద అనే పదం వాడినందుకు ఆమెకు కూడా అదే పదంతో బదులివ్వాలని చూశారు జనసేన నేతలు. “2014లో నువ్వే గెలిచావ్, 2019లో మళ్లీ నువ్వే గెలిచావ్, మీ వైసీపీ ప్రభుత్వమే ఉన్నది. 10 ఏళ్ల పాటు నువ్వే ఆ ప్రాంత ఎమ్మెల్యేవి. మంత్రి కాగానే ఒక సంవత్సరంలో బెంజ్ కార్ కొన్నావు. కానీ ఒక గ్రామానికి నీరు అందించడానికి 10 ఏళ్లు పట్టింది అంటే ఇప్పటవరకు గాడిదలు కాస్తున్నావా? ” అంటూ భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్ చార్జ్ పెట్టిన ఓ ట్వీట్ ని నాగబాబు రీట్వీట్ చేశారు.


దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. రోజా, నాగబాబు మధ్య మాటల యుద్ధం ఒక్కరోజుతో ఆగదు, రెండుమూడు రోజులపాటు ట్వీట్లు, కౌంటర్లు, సెటైర్లు.. ఇలా సాగిపోతుంది ఈ వ్యవహారం.

First Published:  12 Feb 2023 5:01 PM GMT
Next Story