Telugu Global
Andhra Pradesh

బాబు, బాలయ్య, అచ్చెన్న.. రోజా సవాల్ స్వీకరిస్తారా..?

తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో గెలిచామంటూ టీడీపీ నేతలు విర్రవీగుతున్నారని, చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేస్తే.. ఆయా నియోజకవర్గాల్లో వారి బలమెంతో తేలిపోతుందన్నారు.

బాబు, బాలయ్య, అచ్చెన్న.. రోజా సవాల్ స్వీకరిస్తారా..?
X

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజేశాయి. మూడు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ ఓ రేంజ్ లో సవాళ్లు విసురుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయంటూ టీడీపీ నేతలు కవ్విస్తున్నారు. ఈ సెటైర్లకు మంత్రి రోజా కాస్త ఘాటుగానే బదులిచ్చారు. ఏడాది దాకా ఎందుకు ఇప్పుడే రాజీనామా చేయండి తేల్చుకుందామని కౌంటర్ ఇచ్చారు. బాబు, బాలయ్య, అచ్చెన్నకు స్పెషల్ ఆఫర్ అంటూ రెట్టించారు.

దమ్ముంటే రాజీనామా చేయండి..

ఏపీలో వైసీపీ పనైపోయిందని, టీడీపీ వేవ్ మొదలైందని అంటున్న నేతలంతా అసలు విషయం తెలుసుకోవాలన్నారు మంత్రి రోజా. నిజంగానే చంద్రబాబుకి దమ్ము, దైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో సత్తా చూపించాలని సవాల్ విసిరారు.తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో గెలిచామంటూ టీడీపీ నేతలు విర్రవీగుతున్నారని, చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేస్తే.. ఆయా నియోజకవర్గాల్లో వారి బలమెంతో తేలిపోతుందన్నారు.

175 నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఓడించారన్నారు రోజా. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. గెలుపుపై అంత ధీమా ఉంటే లోకేష్ ని ఎందుకు పోటీకి దింపలేదని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే ప్రజా తీర్పు అంటున్నారని, వైసీపీ గెలిస్తే డబ్బులతో గెలిచారంటున్నారని ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు. సైకిల్ గుర్తుపై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కొద్ది మంది ఓటర్లు ఉన్న ప్రత్యేక ఎన్నికల్లో గెలవడం ప్రామాణికం కాదన్నారు. వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించామన్నారు, తిరిగి 2024లో కూడా చూపిస్తామని సవాల్ విసిరారు. పులివెందులలో సీఎం జగన్‌ ని ఓడించే మగాడు పుట్టలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు.

First Published:  19 March 2023 10:39 AM GMT
Next Story