Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి తొలి 'కస్టడీ డే' శుభాకాంక్షలు -రోజా

"పులకేశ్ నీ జాడ ఎక్కడ..?" అంటూ వెటకారం చేశారు. చంద్రబాబు అవినీతి పై బహిరంగ చర్చకు రమ్మన్న లోకేష్.. ఆంధ్రా వదిలి పారిపోయాడని, బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడని ఎద్దేవా చేశారు రోజా.

చంద్రబాబుకి తొలి కస్టడీ డే శుభాకాంక్షలు -రోజా
X

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున సీఎం జగన్ కి బెయిలొచ్చిందని గుర్తు చేస్తూ.. నారా లోకేష్ వెటకారంటగా ఓ ట్వీట్ వేశారు. "బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్" అంటూ ఘాటు ట్వీట్ పెట్టారు. దీనికి మంత్రి రోజా అంతే ఘాటుగా బదులిచ్చారు. రోజా రివర్స్ లో చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. అవినీతి అనకొండ చంద్రబాబుకి తొలి కస్టడీ డే శుభాకాంక్షలు అంటూ కౌంటర్ ఇచ్చారు.


"పచ్చ మీడియాను అడ్డు పెట్టుకొని మీరెన్ని తప్పులు చేసినా ప్రజలకు కనబడవు అనే రోజులు పోయాయి లోకేష్..!" అంటూ ధ్వజమెత్తారు మంత్రి రోజా. చంద్రబాబు చేసిన ప్రతి స్కాంని ఆధారాలతో సహా ప్రజల ముందు, న్యాయస్థానం ముందు ఉంచామన్నారు. చట్ట ప్రకారం చంద్రబాబు వాటిని ఎదుర్కోవాల్సిందేనన్నారు. కుంభకోణాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరూ చట్టానికి తలవంచాల్సిందే.. జైలుకు వెళ్లాల్సిందేనన్నారు రోజా.

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్..!

"లోకేష్.. !నీ లొకేషన్ ఎక్కడ..?" అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు మంత్రి రోజా. తండ్రి అడ్డంగా తినేసి జైలుకి వెళితే, ఆయన ఎలా పోయినా పర్లేదు, తాను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేష్ ఆంధ్రా కి ఎప్పుడొస్తావ్..? అంటూ సెటైర్లు పేల్చారు. తల్లి, భార్య మీద నాన్న భారం వదిలి లోకేష్ పలాయనం చిత్తగించారన్నారు. "పులకేశ్ నీ జాడ ఎక్కడ..?" అంటూ వెటకారం చేశారు. చంద్రబాబు అవినీతి పై బహిరంగ చర్చకు రమ్మన్న లోకేష్.. ఆంధ్రా వదిలి పారిపోయాడని, బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి తాము సిద్ధం అన్నారు. కాదని నిరూపించే ధైర్యం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు రోజా.

First Published:  23 Sep 2023 2:11 PM GMT
Next Story