Telugu Global
Andhra Pradesh

టెస్టింగ్‌కు పంపాం, రిజల్ట్ రావాలి కదా.. తొందరెందుకు? - రోజా

ఒకవేళ అది నిజమైన వీడియో అయితే తప్పకుండా జగన్ చర్యలు తీసుకుంటారన్నారు. మహిళలను ఎవరు ఇబ్బంది పెట్టినా జగన్ ఉపేక్షించబోరన్నారు.

టెస్టింగ్‌కు పంపాం, రిజల్ట్ రావాలి కదా.. తొందరెందుకు? - రోజా
X

గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారంపై మంత్రి రోజా స్పందించారు. టీడీపీ తీరును ఆమె తప్పుబ‌ట్టారు. టీడీపీ వాళ్లు ప్రసారం చేస్తున్న వీడియో నిజమైనదో కాదో తేలాలి కదా అని ప్రశ్నించారు. వీడియోను టెస్టింగ్‌కు పంపారని.. రిజల్ట్‌ రావాలి కదా.. అప్పుడే అంత తొందరెందుకు అని ఆమె ప్రశ్నించారు. కొద్దిగా వెయిట్ చేయండి అంటూ ప్రతిపక్షాలకు సూచించారు.

ఒకవేళ అది నిజమైన వీడియో అయితే తప్పకుండా జగన్ చర్యలు తీసుకుంటారన్నారు. మహిళలను ఎవరు ఇబ్బంది పెట్టినా జగన్ ఉపేక్షించబోరన్నారు. టీడీపీ హయాంలో పిచ్చివాళ్ల మీద కూడా రేప్‌లు జరిగాయని రోజా విమర్శించారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా ప్రతి విషయానికి తాను స్పందించాలని డిమాండ్ చేస్తున్నారని రోజా విమర్శించారు.

చిన్నచిన్న యాంకర్లు కూడా పెద్దపెద్ద కార్లు కొంటున్నారని.. అలాంటిది తాను ఒక కారు కొంటే దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని రోజా విమర్శించారు. రుషికొండ అక్రమ తవ్వకాల్లో కారు సంపాదించుకున్నట్టు ప్రచారం చేయడాన్ని మంత్రి రోజా ఖండించారు. కోడి గుడ్డుపై ఈకలు పీకడం మానుకోవాలని సూచించారు.

First Published:  7 Aug 2022 8:34 AM GMT
Next Story