Telugu Global
Andhra Pradesh

డెవిల్ ఈజ్ బ్యాక్.. మీ అంతు తేల్చేస్తా - మంత్రి రోజా వార్నింగ్

తానిక నడవలేనంటూ జనసైకోలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు రోజా. "డెవిల్ ఈజ్ బ్యాక్ మీ అంతు తేల్చేస్తా.. రాసిపెట్టుకోండి." అంటూ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.

డెవిల్ ఈజ్ బ్యాక్.. మీ అంతు తేల్చేస్తా - మంత్రి రోజా వార్నింగ్
X

ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న మంత్రి రోజా చాలా రోజుల గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చారు. వస్తూ వస్తూనే జనసైనికులు, జనసేనానిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారామె. తనకు ఆరోగ్యం బాలేదని, తానిక నడవలేనంటూ జనసైకోలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు రోజా. "డెవిల్ ఈజ్ బ్యాక్ మీ అంతు తేల్చేస్తా.. రాసిపెట్టుకోండి." అంటూ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.

"ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. ఇంకోరోజు ఎమ్మెల్యే అయితే చాలంటాడు. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు రోడ్లపై తిరుగుతూన్నాడో అర్థం కావట్లేదు" అంటూ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మంత్రి రోజా. గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాననేది చెప్పలేక, వైసీపీ నేతలపై చీప్‌ గా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా లేక వైసీపీ నేతల్ని కొట్టడానికా అని ప్రశ్నించారు. మంత్రుల బట్టలూడదీస్తానని, ఎమ్మెల్యేలను మోకాళ్లపై రోడ్లపై నిలబెడతాంటూ చీప్ గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లేసేవాళ్లు మాత్రమే నా మీటింగ్ లకు రండి, ఊరికే వచ్చి మోసం చేయకండి అంటూ పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల మీద ఆయనకు నమ్మకం లేదని, ఆయనపై ఆయనకే నమ్మకం లేదన్నారు. అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని బూతుపురాణం చెప్పడం బాలేదన్నారు.

మోసం చేస్తారు జాగ్రత్త..

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు చంద్రబాబే స్క్రిప్ట్ ఇస్తున్నారని, కావాలని ఆయన మీడియాలో పవన్ ని హైలెట్ చేస్తున్నారని, పని అయిపోయిన తర్వాత పక్కనపడేస్తారని అన్నారు రోజా. గతంలో చంద్రబాబు గురించి పవన్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబుని నమ్మొద్దంటూ చిరంజీవి ఇచ్చిన సలహా పాటించాలన్నారు రోజా. ఆ సలహా పాటిస్తే కనీసం సినిమాల్లో అయినా సక్సెస్ అవుతారని, లేకపోతే రాజకీయాలకు, సినీరంగానికి కాకుండా పోతారని పవన్ కి హితవు పలికారు.

First Published:  22 Jun 2023 12:04 PM GMT
Next Story