Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు సెల్ఫీగోల్.. పవన్ కి చదువు లేదు

తాము పూర్తి చేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరకు వెళ్ళి చంద్రబాబు సెల్ఫీ తీసుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నారని వెటకారం చేశారు మంత్రి రోజా. జగన్ చేసే కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి, చంద్రబాబు ని కాపాడటానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు సెల్ఫీగోల్.. పవన్ కి చదువు లేదు
X

మంత్రి రోజా మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కి చదువు లేకపోవడం వల్ల రుషికొండ నిర్మాణాలపై అనవసర వ్యాఖ్యానాలు చేస్తున్నారని అన్నారు. రుషికొండపై నిబంధనల ప్రకారమే కట్టడాలు నిర్మిస్తున్నారని చెప్పారు. అన్నిరకాల అనుమతులు తీసుకుని, నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు జరుపుతున్నారని వివరించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో కూడా అదే ఉందన్నారు రోజా. పవన్ కల్యాణ్ అవగాహన లేని వ్యక్తి అని అందుకే అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని చెప్పారు. గీతం యూనివర్సిటీలో లోకేష్ తోడల్లుడి భూములు ఉన్నాయని, అందుకే పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడని ఘాటుగా విమర్శించారు. జగన్ చేసే కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి, చంద్రబాబు ని కాపాడటానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు రోజా.

తాము పూర్తి చేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరకు వెళ్ళి చంద్రబాబు సెల్ఫీ తీసుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నారని వెటకారం చేశారు మంత్రి రోజా. ఆ సెల్ఫీ ఛాలెంజ్ తర్వాతే ప్రజలనుంచి ప్రతిస్పందన ఎక్కువైందని, అసలు చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, జగన్ హయాంలో ఏ జరుగుతుందనే చర్చ మొదలైందని చెప్పారు రోజా.

ఆ స్టిక్కర్ మా అందరికీ గర్వకారణం..

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా 175 సీట్ల టార్గెట్ రీచ్ అవుతామనే నమ్మకం కలుగుతోందన్నారు మంత్రి రోజా. జగనన్న ఫొటోలు ఉన్న స్టిక్కర్ ఇంటిపై, సెల్ ఫోన్ పై బ్యాడ్జ్ వేసుకోవడం తమకు గర్వకారణం అని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం సాధ్యం కాదన్నారు. మరింత గట్టిగా ఈ సారి తాము ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వబోతున్నామని, 175 స్థానాల్లో గ్యారెంటీగా గెలుస్తామని చెప్పారు రోజా.

First Published:  15 April 2023 10:40 AM GMT
Next Story