Telugu Global
Andhra Pradesh

పవన్ పై కూడా సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి రోజా డిమాండ్

చంద్రబాబు ఐటీ నోటీసులపై పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ట్వీట్లతో ప్రశ్నించే పవన్ కి ఐటీ నోటీసు వార్తలు కనపడలేదా అని అడిగారు రోజా.

పవన్ పై కూడా సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి రోజా డిమాండ్
X

ఐటీ నోటీసులతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని, ఆయనపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా. చంద్రబాబుతోపాటు లోకేష్, పవన్ కల్యాణ్ పై కూడా సీబీఐ దర్యాప్తు జరపాలన్నారు. అసలు చంద్రబాబు ఐటీ నోటీసులపై పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ట్వీట్లతో ప్రశ్నించే పవన్ కి ఐటీ నోటీసు వార్తలు కనపడలేదా అని అడిగారు రోజా. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారామె.

హైదరాబాద్ లో సోదాలు చేయాలి..

చంద్రబాబు 600 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని, ఆ ఇంటిలో సీబీఐ సోదాలు చేయాలన్నారు మంత్రి రోజా. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, చివరకు ఇల్లు కూడా లేదని.. హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకులపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారని మండిపడ్డారు. లోకేష్ ఊరు ఊరికి పోయి మొరిగి పోతున్నాడని సెటైర్లు వేశారు. ప్రతి ఎమ్మెల్యేపై లోకేష్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీని తీసుకున్న పవన్ ఊగిపోతూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో సోదాలు చేస్తే 118 కోట్ల రూపాయల నల్లధనం దొరికిందని అన్నారామె. ఆయన హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్ పనుల్లో బినామీల పేరుతో దోచుకున్నారని చెప్పారు. అందర్నీ సీబీఐ కేసులు పెట్టి జైలులో వేయాలన్నారు రోజా.

రజినీ డైలాగ్ అందుకే చెప్పా..

ఆమధ్య ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి హాజరైన రజినీకాంత్ పై వైసీపీ విమర్శలు చేయడం, ఇటీవల ఆయన డైలాగ్ నే రోజా స్టేజ్ పై వినిపించడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై కూడా మంత్రి రోజా స్పందించారు. అసలు సూపర్ స్టార్ రజినీకాంత్ తో తమకు పేచీ ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చిన ఆయన కేవలం ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుండేదని తాను గతంలో అన్నట్టు గుర్తు చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందని మాత్రమే తాము అన్నామని వివరించారు. జైలర్ ప్రీ రిలీజ్ వేడుకలో రజినీకాంత్ డైలాగుల్ని తమకు ముడిపెట్టి జనసేన, టీడీపీ వాళ్లు ట్రోల్స్ చేశారని చెప్పారు. అసలు రజినీకాంత్ డైలాగులు టీడీపీ వాళ్లకు సరిపోతాయన్నారు.

First Published:  4 Sep 2023 8:00 AM GMT
Next Story