Telugu Global
Andhra Pradesh

సొంత తండ్రి చావుకు పురందేశ్వరి కారణం కాదా..? - రోజా

బడ్ల్‌ వేరు, బ్రీడ్‌ వేరు అని బాలకృష్ణ చెబుతుంటారని.. మరి తండ్రిని చంపేసిన చంద్రబాబును ఆ బ్లడ్‌, బ్రీడు ఏమీ చేయదా అని రోజా ఫైర్ అయ్యారు. పురందేశ్వరి చరిత్రను ప్రజలు మరిచిపోయారనుకుని మాట్లాడుతున్నట్టుగా ఉందన్నారు.

సొంత తండ్రి చావుకు పురందేశ్వరి కారణం కాదా..? - రోజా
X

తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు సీఎం చేస్తారని భావించి తండ్రికి వెన్నుపోటు పొడిచే విషయంలో పురందేశ్వరి మద్దతు ఇచ్చార‌ని మంత్రి రోజా విమర్శించారు. విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారని.. ఎవరు విశ్వాసం లేని కుక్కలు అని రోజా ఎదురు ప్రశ్నించారు.

జన్మనిచ్చి, అడ్రస్ ఇచ్చి, ఆస్తులిస్తే.. తండ్రికి అన్నం కూడా పెట్టలేని మీది విశ్వాసమా అని ప్రశ్నించారు. పంచభూతాలు చూస్తున్నాయి, వదలవు అని బాలకృష్ణ మాట్లాడారని ఆ మాట తనకు చాలా కోపాన్ని తెచ్చిందన్నారు. వెన్నుపోటు పొడిచి, పార్టీ లాక్కొని, బతికి ఉండగానే ఎన్టీఆర్‌ను చంపేసిన చంద్రబాబును ఆ పంచభూతాలు ఏమీ చేయవా అని ప్రశ్నించారు. ఇంకా చంద్రబాబు కింద తొత్తులుగా బతుకుతున్నది మీరు కాదా అని రోజా ప్రశ్నించారు.

బడ్ల్‌ వేరు, బ్రీడ్‌ వేరు అని బాలకృష్ణ చెబుతుంటారని.. మరి తండ్రిని చంపేసిన చంద్రబాబును ఆ బ్లడ్‌, బ్రీడు ఏమీ చేయదా అని రోజా ఫైర్ అయ్యారు. పురందేశ్వరి చరిత్రను ప్రజలు మరిచిపోయారనుకుని మాట్లాడుతున్నట్టుగా ఉందన్నారు. తన భర్త సీఎం అవుతారన్న ఆశలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చి సొంత తండ్రి చావుకు కారణమైంది పురందేశ్వరి కాదా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి కేంద్రమంత్రి అయ్యి.. కాంగ్రెస్ జీరో కాగానే బీజేపీలో చేరిపోయారని.. రాజకీయం చేసే ఎలాంటి రంగులైన మార్చే ఊసరవెల్లి అని రోజా విమర్శించారు.

Next Story