Telugu Global
Andhra Pradesh

ఇలా అయితే రాజకీయం చేయడం కష్టం - రోజా

మంత్రి రోజాకు సమాచారం ఇవ్వకుండా కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి చక్రపాణిరెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భూమిపూజ ఎలా చేస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది తనను అవమానించడమేన‌ని రోజా అంటున్నారు.

ఇలా అయితే రాజకీయం చేయడం కష్టం - రోజా
X

మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆమె ఒక ఆడియోను విడుదల చేశారు. చాలా కాలంగా నియోజవర్గంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డికి, రోజాకు మధ్య ఫైట్ నడుస్తోంది. మంత్రి పదవి రాకముందు నుంచే ఈ పోరు ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరస్పరం రోజా, చక్రపాణిరెడ్డి సవాళ్లు చేసుకున్నారు. తాజాగా మంత్రి రోజాకు సమాచారం ఇవ్వకుండా కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి చక్రపాణిరెడ్డి భూమి పూజ చేశారు. దీంతో రోజా నొచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో భూమిపూజ ఎలా చేస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది తనను అవమానించడమేన‌ని రోజా అంటున్నారు.

ఒక ఆడియోను కూడా రోజా విడుదల చేశారు. మంత్రి అయిన తనను నియోజకవర్గంలో వీక్‌ చేసేలా.. టీడీపీ, జనసేన పార్టీ వారు నవ్వుకునేలా నేతలు వ్యవహరిస్తున్నారని ఆమె ఆక్షేపించారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో భూమి పూజ చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఇలాంటి వారు కొనసాగితే తమలాంటి వారికి రాజకీయాలు చేయడం కష్టమవుతుందని కూడా వ్యాఖ్యానించారు. తాము పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తుంటే.. సొంత పార్టీ నేతలే రోజూ మెంటల్ టెన్షన్ పెడుతున్నారని ఆవేదన చెందారు. పార్టీకి, తనకు అన్ని రకాలుగా నష్టం కలిగిస్తున్న ఇలాంటి వారిని పార్టీ నాయకులు అంటూ ప్రోత్సహించడం బాధేస్తోందని రోజా వ్యాఖ్యానించారు.

Next Story