Telugu Global
Andhra Pradesh

అది దుశ్సాసన పార్టీ.. ప్రెస్ మీట్ లో రోజా కంటతడి

బండారును వదిలిపేట్టేది లేదని, పరువునష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తానన్నారు. బండారు వ్యాఖ్యలను ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. మహిళలను కించపరిచే మానవ మృగాలను ఎందుకు ప్రశ్నించరు అని కామెంట్ పెట్టారు.

అది దుశ్సాసన పార్టీ.. ప్రెస్ మీట్ లో రోజా కంటతడి
X

"బ్లూ ఫిలిమ్స్‌ లో నటించింది అంటూ నన్ను టార్చర్‌ చేస్తున్నారు.. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు.. కానీ, ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్‌ ను జడ్జ్‌ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువులా చూస్తోంది. దమ్ముంటే సీడీలను ప్రజల్లోకి విడుదల చేయాలి. నాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదు." అంటూ ధ్వజమెత్తారు మంత్రి రోజా. బండారు అరెస్ట్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ దశలో కన్నీటిపర్యంతం అయ్యారు. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే, ఇలాంటి వారు ఉన్న టీడీపీకి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుంది.. అని ప్రశ్నించారామె.

టీడీపీ అంటే దండుపాళ్యం పార్టీ, తెలుగు దొంగల పార్టీ, తెలుగు దుశ్శాసన పార్టీ అని ధ్వజమెత్తారు రోజా. రాజకీయాల్లోకి రావటమే తప్పు అన్నట్లుగా దండుపాళ్యం నేతలు ఒళ్లు బలిసి విమర్శలు చేస్తున్నారని, రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నానని.. మహిళా సాధికారితకు పాటుపడుతున్నానని వివరించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా.


లోకేష్ తో పాటు ఇతర టీడీపీ నేతలు బండారు అరెస్టును ఖండించారని.. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించారు రోజా. ఎన్టీఆర్‌ కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారన్నారు. మహిళలను కానీ, తమ నాయకుడు జగన్ ని కానీ.. విమర్శిస్తే తాను ఊరుకోబోనన్నారు. బండారును వదిలిపేట్టేది లేదని, పరువునష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తానన్నారు. బండారు వ్యాఖ్యలను ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. మహిళలను కించపరిచే మానవ మృగాలను ఎందుకు ప్రశ్నించరు అని కామెంట్ పెట్టారు.

First Published:  4 Oct 2023 2:58 AM GMT
Next Story