Telugu Global
Andhra Pradesh

వారికి నోరు లేస్తే మాకు చేయి లేస్తుంది –రోజా

పనికిమాలిన వెధవలు, పైసాకి పనికిరాని వ్యక్తులతో మంత్రుల్ని, ఎమ్మెల్యేలను తిట్టిస్తున్నారని, అందుకే తాము చేతులతో సమాధానం చెప్పాల్సి వస్తోందని అన్నారు రోజా.

వారికి నోరు లేస్తే మాకు చేయి లేస్తుంది –రోజా
X

టీడీపీ నేతలకు నోరు లేస్తే మాకు చేయి లేస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. పనికిమాలిన వెధవలు, పైసాకి పనికిరాని వ్యక్తులతో మంత్రుల్ని, ఎమ్మెల్యేలను తిట్టిస్తున్నారని, అందుకే తాము చేతులతో సమాధానం చెప్పాల్సి వస్తోందని అన్నారు. గన్నవరంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలు పెట్టింది టీడీపీయేనని గుర్తు చేశారు రోజా.

పోలీసు వ్యవస్థను వాడుకోవడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని అన్నారు రోజా. ఏపీలో పోలీసులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. చంద్రబాబుని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. 14 మంది వెనుకబడి కులాల వారికి ఎమ్మెల్సీలు ఇచ్చి గౌరవిస్తున్న పార్టీ వైసీపీ అని చెప్పారు రోజా. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, టీడీపీ నేతలేనని మండిపడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నారాయణ రెడ్డి హత్య, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వంటి ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల్లో 29 మంది అమాయకుల ప్రాణాలను బలి కొనడమే కాకుండా, పోలీసులను తనకు అనుకూలంగా మలుచుకుని ఆ కేసు నుండి ఎస్కేప్ అయిపోయిన ఘనుడు చంద్రబాబేనన్నారు రోజా.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో నిర్వహించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న రోజా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వెనుకబడిన కులాల వారికి ఎమ్మెల్సీల‌ పదవులు ఇవ్వడంతో ఓర్వలేని చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారన్నారు. గన్నవరం ఘటనే దానికి ఉదాహరణ అని చెప్పారు. లోకేష్ పాదయాత్రకి తామెప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, లోకేష్ నగరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ టీడీపీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి తన ఇంటి పైకి పంపించాడని.. దాన్నిబట్టే చంద్రబాబు, లోకేష్ ఎటువంటి వారో అర్ధం అవుతుందని అన్నారు రోజా. రాష్ట్రంలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తే ఆంధ్ర నుండి పారిపోయి హైదరాబాద్ లో ఉంటున్నారని, 2024లో ప్రజలు హైదరాబాద్ లో కూడా చంద్రబాబుని ఉండనివ్వరని, తరిమి తరిమి కొడతారని అన్నారు.

First Published:  22 Feb 2023 12:04 PM GMT
Next Story