Telugu Global
Andhra Pradesh

బాబు జైల్లో.. బాలకృష్ణ షూటింగుల్లో.. - మంత్రి రోజా ఫైర్

గతంలో కూడా బాలకృష్ణ ఓ సినిమా ఫంక్షన్లో మహిళలను చులకన చేస్తూ మాట్లాడారని.. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలని కామెంట్స్ చేశాడని మంత్రి రోజా గుర్తుచేశారు.

బాబు జైల్లో.. బాలకృష్ణ షూటింగుల్లో.. - మంత్రి రోజా ఫైర్
X

ప్రముఖ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టై జైల్లో ఉంటే టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండగా.. బాలకృష్ణ మాత్రం సినిమా షూటింగులు చేసుకుంటున్నారని విమర్శించారు. భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల నిర్వహించగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీలతో బాలకృష్ణ వయసుకు తగ్గట్లుగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ఆమె వయసు ఎంతో చిన్నదని.. అలాంటి అమ్మాయి పట్ల బాలకృష్ణ అలాగేనా ప్రవర్తించేది అని ప్రశ్నించారు.

గతంలో కూడా బాలకృష్ణ ఓ సినిమా ఫంక్షన్లో మహిళలను చులకన చేస్తూ మాట్లాడారని.. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలని కామెంట్స్ చేశాడని మంత్రి రోజా గుర్తుచేశారు.

ఎన్టీఆర్ కుమారుడు అయి ఉండి.. అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి సరిగా లేకపోతే ఎలా..? అని మంత్రి రోజా నిలదీశారు. వాళ్లు సరిగ్గా ఉండరు కానీ, వేరే వాళ్ళు సరిగ్గా ఉండట్లేదని మాత్రం విమర్శలు చేస్తారన్నారు. తాను కూడా జబర్దస్త్ షోలో హోస్ట్ గా వ్యవహరించానని, ఎంత ఎంటర్టైన్మెంట్ షో అయినా.. ఎప్పుడు ఒకరి పట్ల వల్గర్ గా ప్రవర్తించలేదని చెప్పారు. ఏ ఆర్టిస్టుపై కానీ, హీరోపై కానీ విమర్శలు చేసింది లేదన్నారు.

బాలకృష్ణ మాట్లాడినట్టుగా ఏ హీరో మాట్లాడారని, ఆయనేదో పైనుంచి దిగివచ్చినట్లుగా మాట్లాడుతుంటాడని మండిపడ్డారు. మేమేం చెప్పినా కరెక్టే.. మేమేం చేసినా కరెక్టే.. అన్నట్లుగా ప్రవర్తిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్లు మంచోళ్ళు కాదు, వాళ్ల ఫ్యామిలీ మంచిది కాదు అని విమర్శలు చేస్తారని రోజా విమర్శించారు.

First Published:  19 Oct 2023 6:50 AM GMT
Next Story