Telugu Global
Andhra Pradesh

అంబానీ సేవలో మంత్రి, ఎంపీలు, కలెక్టర్, ఎస్పీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ముఖేష్‌ అంబానికి స్వాగతం పలికేందుకు అధికార పార్టీనేతలతో పాటు.. జిల్లా కలెక్టర్‌ కూడా తరలివచ్చారు. జిల్లా ఎస్సీ కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చి అంబానీకి స్వాగతం పలికారు.

అంబానీ సేవలో మంత్రి, ఎంపీలు, కలెక్టర్, ఎస్పీ
X

అంబానీలకు పాలకులే కాదు ఉన్నతాధికారులు సాగిలపడుతున్నారు. కీలక నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న ఐఏఎస్‌లు కూడా ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా పారిశ్రామికవేత్తల స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ముఖేష్‌ అంబానికి స్వాగతం పలికేందుకు అధికార పార్టీనేతలతో పాటు.. జిల్లా కలెక్టర్‌ కూడా తరలివచ్చారు. జిల్లా ఎస్సీ కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చి అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్ దర్శన ఏర్పాట్లను వైసీపీ ఎంపీలు దగ్గరుండి పర్యవేక్షించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ముఖేష్ అంబానీ తన కుటుంబసభ్యులతో కలిసి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి తదితరులు అంబానీ రాకకు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకుని నిరీక్షించారు.

అంబానీ రాగానే నేతలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని ముఖేష్ అంబానీకి స్వాగతం పలికేందుకు జిల్లా మేజిస్ట్రేట్ హోదా ఉన్న కలెక్టర్, జిల్లా ఎస్పీ రావడం విమర్శలకు తావిస్తోంది. ఆ తర్వాత అంబానీకి వీడ్కోలు పలికేందుకు కూడా కలెక్టర్, ఎస్పీలు వచ్చారు. పైగా అంబానీ ఏమీ పెట్టుబడులపై చర్చించేందుకు ఏపీకి రాలేదు. స్వామిదర్శనం కోసం కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారు. దేశంలో పాలకులు, అధికారులు, పెట్టుబడిదారులు అంతా కలిసి పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం.

First Published:  16 Sep 2022 12:15 AM GMT
Next Story