Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఏం చేశాడని ప్రజలను ఓట్లడుగుతాడు..?

ఓడిపోతున్నామనే భయంతో చంద్రబాబు దుష్టకూటమి ఎన్నో కుట్రలు పన్నుతోందని, మూడు కండువాలు సరిపోక మిగిలిన పార్టీలతో తెరచాటు రాజకీయం చేస్తూ ప్యాకేజీలు ఇచ్చి రోడ్లపైకి వదులుతున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చంద్రబాబు ఏం చేశాడని ప్రజలను ఓట్లడుగుతాడు..?
X

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం చేశాడని ఓట్లడుగుతాడని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోచుకున్నందుకే జైలు ఊచలు లెక్కపెట్టి వచ్చాడని ఆయన తెలిపారు. తణుకులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు పదవిలో ఉన్న కాలంలో పచ్చమీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5, మహా టీవీలకు వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టిన ఘనుడు చంద్రబాబని మంత్రి వివ‌రించారు.

నిజాన్ని అబద్ధం చేయడంలోనూ, అబద్ధాన్ని నిజంగా చూపించడంలోనూ పచ్చమీడియా పీహెచ్‌డీ చేసిందని మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రూపాయినీ పారదర్శకంగా సంక్షేమం రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తుంటే చంద్రబాబు మాత్రం అధికారంలో ఉండగా రూ.2 లక్షల కోట్లు కూడబెట్టి ఆ ధనంతో నేడు తన మందీమార్బలాన్ని పోషిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమీడియాతో పాటు పచ్చ బ్యాచ్‌ను వేలాదిగా వదిలాడని, వీరంతా ప్రతి నియోజకవర్గంలోనూ కూటమి గెలుస్తుందంటూ మౌత్‌ పబ్లిసిటీ చేయడం, కూటమి మెజారిటీపై లక్షకు రెండు లక్షలు పందెం ఇస్తామంటూ హైప్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి చెప్పారు. కానీ పందేనికి సిద్ధమంటే పారిపోతున్నారని తెలిపారు.

ఓడిపోతున్నామనే భయంతో చంద్రబాబు దుష్టకూటమి ఎన్నో కుట్రలు పన్నుతోందని, మూడు కండువాలు సరిపోక మిగిలిన పార్టీలతో తెరచాటు రాజకీయం చేస్తూ ప్యాకేజీలు ఇచ్చి రోడ్లపైకి వదులుతున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. సంక్షేమంపై చంద్రబాబు అన్నీ మేము ఇచ్చేస్తాం అని చెబుతుంటే లోకేష్‌ మాత్రం మా కౌన్సిలర్లు చెప్పిన వారికే పింఛన్లు, రైస్‌ కార్డులు ఇస్తాం కానీ ఈ విషయంలో ఎవరినీ సహించబోమంటూ బహిరంగ సభలో చెప్పడం వారి బరితెగింపునకు నిదర్శనమన్నారు.

First Published:  12 April 2024 2:46 AM GMT
Next Story