Telugu Global
Andhra Pradesh

రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది..

ఒక పార్టీలో గెలిచిన వారిని ఇంకో పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులివ్వడం నారావారి రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు కాకాణి.

రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది..
X

మూడు రోజుల నెల్లూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు, జగన్ పై ధ్వజమెత్తారు. పనిలో పనిగా స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కూడా ఆయన సెటైర్లు పేల్చారు. కోర్టులో సాక్ష్యాలు మాయం చేయడం గొప్ప ఇన్నోవేటివ్ ఐడియా అని అన్నారు. కాకాణి మంత్రి పదవి చేపట్టిన మూడోరోజే ఆయన దోషిగా ఉన్న కేసులో సాక్ష్యాలు మాయం అయ్యాయని గుర్తు చేశారు. దీంతో కాకాణి రివర్స్ అయ్యారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని చెడామడా తిట్టేశారు.

ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమేమి చేయకూడదో అవన్నీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఒక పార్టీలో గెలిచిన వారిని ఇంకో పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులివ్వడం నారావారి రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకెక్కడిదన్నారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు కాకాణి.

చంద్రబాబు తప్పుల్ని బీబీసీ కూడా ఎత్తి చూపించింది..

కందుకూరులో చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లే 8మంది చనిపోయారని బీబీసీ కూడా వార్తలిచ్చిందని, ఆయన తప్పులు అంతర్జాతీయ మీడియాలోకి కూడా ఎక్కాయని అన్నారు కాకాణి. చంద్రబాబు హయం అంతా కరువుకాటకాలే అని చెప్పారు. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను వీధిలోకి లాగాడని ఎద్దేవా చేసారు.

మేనిఫెస్టో ఎందుకు దాచేశావ్ బాబూ..!

పార్టీ తరపున ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను దొంగిలించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి కాకాణి. ప్రస్తుతం టీడీపీ మేనిఫెస్టో ఎక్కడా కనపడ్డం లేదని, సోషల్ మీడియాలో కూడా దాన్ని తొలగించారని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ గా వైసీపీ భావిస్తుందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోని ఎక్కడా కనపడకుండా చేసి అన్ని వర్గాలను మోసం చేశారని చెప్పారు.

First Published:  31 Dec 2022 3:21 PM GMT
Next Story