Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణ, షర్మిలపై జోగి ఘాటు వ్యాఖ్యలు

బాలకృష్ణ సిగ్గులజ్జ వదిలేసి తిరుగుతున్నారని విమర్శించారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడుక్కి కూతురిని ఇచ్చావ్.. అసలైన శునకం, దద్దమ్మ నువ్వు అంటూ బాలకృష్ణపై ఫైర్ అయ్యారు.

బాలకృష్ణ, షర్మిలపై జోగి ఘాటు వ్యాఖ్యలు
X

బాలకృష్ణ చేసిన ట్వీట్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. సొంత తండ్రికి వెన్నుపోటు పొడుస్తుంటే చంద్రబాబు అనే కుక్కకు తోకగా పనిచేసిన బాలకృష్ణకు ఈ రోజు మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. నా కడుపున పుట్టిన బిడ్డలే అయితే చంద్రబాబుకు బుద్ధి చెప్పండి అని 73ఏళ్ల వయసులో ఎన్టీఆర్ వేడుకుంటే.. ఆయ‌న‌ ఆఖరి కోరిక కూడా తీర్చలేని చవ‌టలు అని బాలకృష్ణ, ఆయన సోదరులు అంటూ జోగి ఫైర్ అయ్యారు.

బాలకృష్ణ సిగ్గులజ్జ వదిలేసి తిరుగుతున్నారని విమర్శించారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడుక్కి కూతురిని ఇచ్చావ్.. అసలైన శునకం, దద్దమ్మ నువ్వు అంటూ బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌ జన్మనిస్తే.. వైఎస్‌ పునర్‌జన్మనిచ్చారు.. బాలకృష్ణకు నిజాయితీ ఉంటే వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉండాలన్నారు. నందమూరి అడ్రస్‌ కేరాఫ్‌ నారాగా మార్చేసిన చవటలు మీరు అంటూ విరుచుకుపడ్డారు. పెట్టుడు మీసాలు మేలేసి, డైలాగులు చెబితే ఏమీ కాదన్నారు.

షర్మిలమ్మ అసెంబ్లీలో జగన్ మాటలు విని ఉండరని అందుకే పేరు పెట్టడాన్ని తప్పుపట్టి ఉండవచ్చన్నారు. జగన్‌ స్పీచ్‌ విని ఉంటే ఆమె అలా మాట్లాడే వారు కాదన్నారు. ఆమె చూశారో లేదో తమకు తెలియదని.. పక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి అక్కడి పరిస్థితులు ఏంటో కూడా తమకు తెలియదన్నారు.

First Published:  24 Sep 2022 12:10 PM GMT
Next Story