Telugu Global
Andhra Pradesh

ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే.. మంత్రి జోగి రమేష్ కామెంట్స్

రాజమండ్రి జైలు దగ్గర జరిగిన ఎపిసోడ్ కు సినిమా టైటిల్ పెట్టారు. `ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే..` సినిమా టైటిల్ అని, బొక్కలో బాబు 7691.. అనేది ట్యాగ్ లైన్ అని చెప్పుకొచ్చారు.

ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే.. మంత్రి జోగి రమేష్ కామెంట్స్
X

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖరారు అయినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు హడావుడి చేసినా సాధారణ జనం మాత్రం అంతగా పట్టించుకోలేదు.

టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇదివరకే పలుమార్లు ప్రస్తావించారు. అటు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తు ఉంటుందని తెలిపారు. ఇరు పార్టీల నాయకుల మధ్య సీట్ల వ్యవహారమై చర్చలు కూడా జరిగాయి. ఇంత వ్యవహారం జరిగిన తర్వాత కూడా ఇప్పుడేదో కొత్తగా పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు వద్ద ప్రకటన చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

అయితే ఈ ఎపిసోడ్‌పై మంత్రి జోగి రమేష్ తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. నిన్న రాజమండ్రి జైలు వద్ద జరిగిన ఈ వ్యవహారం అంతా ఓ సినిమాను తలపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి జైలు దగ్గర జరిగిన ఎపిసోడ్ కు సినిమా టైటిల్ పెట్టారు. `ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే..` సినిమా టైటిల్ అని, బొక్కలో బాబు 7691.. అనేది ట్యాగ్ లైన్ అని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ ఒకపక్క బీజేపీతో సంసారం చేస్తూ జైల్లోకి వెళ్లి చంద్రబాబుతో తాళి కట్టించుకున్నారని జోగి రమేష్ విమర్శించారు. జైలు బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తానంటూ పవన్ ప్రకటించడంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో యుద్ధం చేయడం అంటే రాష్ట్రంలోని ప్రజలందరితో యుద్ధం చేయడమేనని ఆయన అన్నారు. సీఎం జగన్ పై పోరాటం చేయడం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలపై యుద్ధం చేయడమే అని అన్నారు.

స్కిల్ కుంభకోణంలో పవన్ కూడా భాగస్వామి అని, ఈ కుంభకోణంలో పవన్ కు ఎంత వాటా వచ్చిందని మంత్రి జోగి రమేష్ నిలదీశారు. నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో ఏం చెబుతారని ప్రశ్నించారు. నా తండ్రి 370 కోట్ల రూపాయలు కొట్టేసి జైల్లో కూర్చున్నాడని చెబుతాడా..? అని ప్ర‌శ్నించారు.

First Published:  15 Sep 2023 2:07 PM GMT
Next Story