Telugu Global
Andhra Pradesh

పవన్ తొలి అన్యాయం ఉత్తరాంధ్రకే.. మంత్రి గుడివాడ లాజిక్

విశాఖకు చెందిన కాపు బిడ్డను పవన్ వివాహం చేసుకుని అన్యాయం చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పవన్, ఇప్పుడు ఆ ప్రాంతానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.

పవన్ తొలి అన్యాయం ఉత్తరాంధ్రకే.. మంత్రి గుడివాడ లాజిక్
X

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో దశకు చేరుకున్న సందర్భంలో ఆయనకు 10 ప్రశ్నలు సంధించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్రకు వస్తున్న పవన్ కల్యాణ్, మొదట అన్యాయం చేసింది కూడా ఉత్తరాంధ్రకే అని అన్నారు. ఆయన మొదటి వివాహాన్ని గుర్తు చేశారు. విశాఖకు చెందిన కాపు బిడ్డను పవన్ వివాహం చేసుకుని అన్యాయం చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పవన్, ఇప్పుడు ఆ ప్రాంతానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.

ఆ 10 ప్రశ్నలు ఇవే..

1. గాజువాకలో ఓడిపోయినందుకు వారాహి విజయ యాత్ర చేస్తున్నారా?

2. 175స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను పవన్ ప్రకటించగలరా?

3. విశాఖ రాజధానిని స్వాగతించలేని పవన్‌ కు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే అర్హత ఉందా?

4. బాబు తానా అంటే తందానా అనడం కాకుండా ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధిపై పవన్ విధానమేంటో చెప్పాలి.

5. బీజేపీ భాగస్వామ్యంలో ఉండి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ పై పవన్ ఎందుకు బాధ్యత తీసుకోలేదు..?

6. టీటీడీ ఛైర్మన్ పదవిపై రాద్దాంతం చేస్తున్న ప్యాకేజ్ స్టార్‌ కు టీడీపీ హయాంలో కూల్చేసిన 40 గుళ్లు కనిపించ లేదా?

7. చంద్రబాబు ప్యాకేజ్ తీసుకుని పోలవరంపై టీడీపీకి వంత పాడిన వ్యక్తి పవన్ కల్యాణ్ కాదా?

8. స్పెషల్ స్టేటస్‌ పై పవన్ కల్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి.

9. ఉద్దానం సమస్యలపై పట్టించుకోని పవన్ కల్యాణ్.. ప్రభుత్వం ఆస్పత్రి కట్టించి, రక్షిత మంచినీరు సరఫరా చేస్తుంటే కనీసం అభినందించలేరా?

10. అల్లర్లు సృష్టించేందుకే చంద్రబాబు రాష్ట్రంలో పర్యటనలు చేస్తుంటే ఎందుకు పవన్ కల్యాణ్ స్పందించడం లేదు?

వెబ్ సిరీస్..

వారాహి యాత్రను వెబ్ సిరీస్ తో పోల్చారు మంత్రి అమర్నాథ్. తాను అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేనకు విధానం అంటూ లేదని ఎద్దేవా చేశారు. వారాహి యాత్ర ఎందు కోసమో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తనకు నచ్చని వ్యక్తులను సినిమాల్లో తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంతృప్తిపడే చిన్న పిల్లల మనస్తత్వం పవన్ ది అని అన్నారు మంత్రి అమర్నాథ్. బ్రో సినిమా తుస్సు అని, మొదటి రోజు సాయంత్రమే థియేటర్లు ఖాళీ అయ్యాయని చెప్పారు.

First Published:  9 Aug 2023 1:42 PM GMT
Next Story