Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు జైల్లో ఉన్నాడన్న బాధే లేదు వారిలో..

చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన భార్య, కోడలు రాజమండ్రి, హైదరాబాద్‌ల మధ్య యాత్రలు నిర్వహిస్తుంటే, లోకేష్ ఢిల్లీ యాత్రలు, ఇక బాలకృష్ణ సినిమా యాత్రలు చేపడుతున్నాడని అమర్నాథ్ విమర్శించారు.

చంద్రబాబు జైల్లో ఉన్నాడన్న బాధే లేదు వారిలో..
X

చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉన్నాడన్న బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించడం లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు భార్య, కోడలు ఒకరోజు రాజమండ్రిలో ఉంటే మరొక రోజు హైదరాబాద్ లో ఉంటున్నారని, ఇక లోకేషేమో యువగళం పాదయాత్రకు బ్రేక్ దొరికిందని విహారయాత్ర లాగా ఢిల్లీకి వెళ్లిపోయారన్నారు.

మంత్రి అమ‌ర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భార్య, కోడలు వ్యాపారాల్లో బిజీగా ఉండగా, ఆయన బామ్మర్ది బాలకృష్ణ సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్నాడని అన్నారు. భగవంత్ కేసరి సినిమాను రిలీజ్ చేసుకున్నాడని, ఆ మధ్య ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టేజ్ పైన డ్యాన్స్ వేశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన భార్య, కోడలు రాజమండ్రి, హైదరాబాద్‌ల మధ్య యాత్రలు నిర్వహిస్తుంటే, లోకేష్ ఢిల్లీ యాత్రలు, ఇక బాలకృష్ణ సినిమా యాత్రలు చేపడుతున్నాడని అమర్నాథ్ విమర్శించారు.

చంద్రబాబు జైల్లో ఉన్నందువల్ల నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఏపీలో దసరా పండుగ జరుపుకొంటున్నామ‌ని, ఇందుకు ఆనందపడుతున్నామని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, బ్రాహ్మణి, భువనేశ్వరి, పవన్ కళ్యాణ్.. వీళ్లంతా ఆంధ్రప్రదేశ్ కు నాన్ లోకల్స్ అని మంత్రి అన్నారు.

ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు వీరు ఏపీకి వచ్చి పండుగ జరుపుకున్నది లేదన్నారు. వచ్చే ఎన్నికలు స్థానికులకు, స్థానికేతరులకు మధ్య జరుగుతున్నాయని.. ఈ పోటీలో ప్రజలు మరోసారి జగన్ పక్కన నిలబడి వరుసగా రెండోసారి ఆయనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఖజానాను కాజేసిన దొంగ చంద్రబాబు అని తేలిందని, ఆయన పక్కన నిలబడేందుకు జనం సిద్ధంగా లేరని మంత్రి చెప్పారు.

First Published:  20 Oct 2023 2:55 AM GMT
Next Story