Telugu Global
Andhra Pradesh

సైకిల్ పోవాలని బాబు పిలుపిస్తే.. ఇంకా ఓటేసేదెవ‌రు..?

నా ప్ర‌తిపాద‌న‌కి సీఎం జగన్ ఒప్పుకోలేదని ధ‌ర్మాన వివ‌రించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం కోరారని తెలిపారు. ఇదే విష‌యంపై ఏదో ఒక‌టి తేల్చుకునేందుకు ఇంకా స‌మ‌యం ఉంద‌న్నారు.

సైకిల్ పోవాలని బాబు పిలుపిస్తే.. ఇంకా ఓటేసేదెవ‌రు..?
X

సైకిల్ పోవాలని చంద్రబాబే స్వయంగా పిలుపునిస్తుంటే, ఇంకా సైకిల్ కి ఓటేయమని చెప్పేదెవరు..? అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సందేహం వ్య‌క్తం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం వొప్పంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, తప్పుకుంటాన‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెప్పాన‌ని తెలిపారు. విశ్రాంతి తీసుకోవాల్సిన టైం వచ్చిందని అనిపిస్తుందని ముఖ్య‌మంత్రికి చెప్పాన‌న్నారు. నా ప్ర‌తిపాద‌న‌కి సీఎం జగన్ ఒప్పుకోలేదని ధ‌ర్మాన వివ‌రించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం కోరారని తెలిపారు. ఇదే విష‌యంపై ఏదో ఒక‌టి తేల్చుకునేందుకు ఇంకా స‌మ‌యం ఉంద‌న్నారు. త‌న త‌రువాతి త‌రం నాయ‌కుల‌కు ప‌ద‌వులు రావాల‌ని, పోటీచేసే అవ‌కాశం రావాల‌ని ఆకాంక్షించారు.

Next Story