Telugu Global
Andhra Pradesh

బీజేపీతో సంసారం..టిడిపితో శృంగారం..

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌వ‌హార‌శైలి బీజేపీతో సంసారం..టిడిపితో శృంగారం..మాదిరిగా వుంద‌ని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీతో సంసారం..టిడిపితో శృంగారం..
X

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌వ‌హార‌శైలి బీజేపీతో సంసారం..టిడిపితో శృంగారం..మాదిరిగా వుంద‌ని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డీల్ కుదుర్చుకోవ‌డం, ప్యాకేజీ సెట్ చేసుకోవ‌డ‌మే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి తెలిసిన రాజ‌కీయం అని ఆరోపించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పేరు జనసేన కాదు.. అది 'నారా-నాదెండ్ల' సేన అంటూ ఎద్దేవ చేశారు. రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోక కల్యాణం అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుసుకోవాల‌న్నారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా పవన్ కు వేరే ఆఫీసు ఎందుకు దండ‌గ అంటూ సెటైర్లు వేశారు. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే ప‌వ‌న్ జుత్తు పెంచుతున్నాడ‌ని విమ‌ర్శించారు.

ప్రతి నమస్కారంతో పాటు ప్రతి ఒక్కరికి మంచి చేసే సంస్కారం జగన్ కే సొంతమ‌ని వైసీపీ నేత‌లు పేర్కొన్నారు.

First Published:  22 Aug 2022 1:21 PM GMT
Next Story