Telugu Global
Andhra Pradesh

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రాజా సెటైర్లు

భరత్ అనే నేను సినిమాలో లాగా ఒకసారి సీఎం అయిపోతానంటాడు మరోసారి ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో లాగా కనీసం ఎమ్మెల్యేగా గెలిపించండి అని వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రాజా సెటైర్లు
X

గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్‌ అయిందన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది కూడా రావడం లేదన్నారు. ఇలా అయితే యజమాని ప్యాకేజీ తగ్గించే అవకాశం ఉందని కాబట్టి పవన్‌ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు ఒక బ్రోకర్‌గా చూస్తున్నారని, ఇలా సభలకు జనం రాకపోతే లోఫర్‌లా చూసే పరిస్థితి వస్తుందన్నారు.

పదేపదే సీఎం అవుతా.. అని పవన్‌ అంటున్నారని, ఈ రాష్ట్రంలో కోటి వరకు యువకులు ఉన్నారని వారంతా కూడా అనుష్కానో, తమన్నానో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని.. అందుకు యువకులు అనుకుంటే సరిపోదని.. అనుష్క, తమన్నాలు ఒప్పుకోవాలని.. అదే విధంగా పవన్‌ కల్యాణ్ సీఎం కావాలనుకుంటే అయిపోరని.. అందుకు ప్రజలు ఒప్పుకోవాలన్నారు.

రోజుకో విధంగా మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ను మానసిక వైద్యుల దగ్గర పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. భరత్ అనే నేను సినిమాలో లాగా ఒకసారి సీఎం అయిపోతానంటాడు మరోసారి ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో లాగా కనీసం ఎమ్మెల్యేగా గెలిపించండి అని వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

హఠాత్తుగా అమరావతి మీద కూడా పవన్‌కు ప్రేమ పుట్టిందని.. అమరావతి అంటే పద్మావతో, సత్యవతో కాదన్న విషయాన్ని పవన్‌ గుర్తించాలన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా జగన్‌ను తిడుతూ లారీ వేసుకుని తిరిగితే ఉపయోగం ఉండదన్నారు మంత్రి.

First Published:  17 Jun 2023 7:35 AM GMT
Next Story