Telugu Global
Andhra Pradesh

విపక్ష నాయకుడిగా కూడా చంద్రబాబు ఫెయిల్.. - మంత్రి చెల్లుబోయిన

బలహీన వర్గాలు ఎవరి దగ్గరా యాచించకండా ఆత్మగౌరవంగా బతకాలని జగన్ ఆలోచించారని గుర్తు చేశారు. 33లక్షల మంది బీసీలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైసీపీదే అన్నారు.

విపక్ష నాయకుడిగా కూడా చంద్రబాబు ఫెయిల్.. - మంత్రి చెల్లుబోయిన
X

చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు విపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్ అయ్యారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాల‌యంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు 600 హామీలిచ్చి మోసగించారని విమర్శించారు. రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని నిలువునా ముంచేశాడన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వర్గాలను మోసగించిన తెలుగుదేశం పార్టీకి.. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. బీసీలకు 34శాతం రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చారని లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 32.33శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని గుర్తు చేశారు. టీడీపీ-వైసీపీ పాలనలో బీసీలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

బీసీలంటే వెనకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలని సీఎం జగన్ సిద్దాంతం అన్నారు. బీసీలకు ఐటీ ఉద్యోగాలు రాకపోవడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో చంద్రబాబు ఇస్త్రీ పెట్టె, కుర్చీ ఇస్తే.. జగనన్న చేదోడు పథకం కింద ఒక్కొక్కరికి వడ్డీ లేకుండా పదివేల రూపాయలు ఇస్తున్నామని ఉద్ఘాటించారు.

బలహీన వర్గాలు ఎవరి దగ్గరా యాచించకండా ఆత్మగౌరవంగా బతకాలని జగన్ ఆలోచించారని గుర్తుచేశారు. 33లక్షల మంది బీసీలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైసీపీదే అన్నారు. పేదవాడికి, పెత్తందారికి మధ్య జరిగే యుద్ధంలో పేదవారి కోసం నిలబడ్డ నాయకుడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

First Published:  30 Jan 2023 1:25 PM GMT
Next Story