Telugu Global
Andhra Pradesh

బొత్స‌, చంద్ర‌బాబు.. ఏంటీ గేట్ల గోల‌..?

చంద్ర‌బాబు చేసిన అలాంటి కామెంట్ వైసీపీలో కాక రేపింది. దీనికి వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అంతే గ‌ట్టిగా కౌంట‌రూ ఇచ్చిపారేశారు.

బొత్స‌, చంద్ర‌బాబు.. ఏంటీ గేట్ల గోల‌..?
X

తెలంగాణ‌లో ఎన్నిక‌లొస్తున్న నేప‌థ్యంలో అంద‌రూ టికెట్ల గొడ‌వ‌లో ఉంటే ఏపీలో ఇంకా ఎన్నిక‌లు రాకుండానే నాయ‌కులు రోజుకో కొత్త తీరులో తిట్టుకుంటున్నారు. త‌మ పార్టీదే గెలుప‌ని ప్ర‌జ‌ల‌తో మైండ్‌గేమ్ ఆడే క్రమంలో శ్రుతిమించి కామెంట్లు చేసుకుంటున్నారు. తాజాగా చంద్ర‌బాబు చేసిన అలాంటి కామెంట్ వైసీపీలో కాక రేపింది. దీనికి వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అంతే గ‌ట్టిగా కౌంట‌రూ ఇచ్చిపారేశారు.

మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ

ఎన్టీఆర్ నాణెం ఆవిష్క‌ర‌ణ పేరుతో ఢిల్లీ వెళ్లి మ‌కాం వేసిన చంద్ర‌బాబు అక్క‌డ మీడియాతో మాట్లాడుతుండ‌గా మీ పార్టీకి అన్ని చోట్లా అభ్య‌ర్థులు లేర‌ని వైసీపీ అంటోంద‌ని ఓ మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించారు. దీంతో మండిప‌డ్డ చంద్ర‌బాబు మా పార్టీ టికెట్ల కోసం అప్పుడే క్యూ క‌ట్టేశార‌న్నారు. అస‌లు తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంద‌ని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

బీజేపీ గేట్లు తెరిస్తే బాబు దూరిపోదామ‌నుకుంటున్నాడు

దీనికి వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌ట్టి కౌంట‌రే ఇచ్చేశారు. చంద్ర‌బాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెర‌వాల‌ని చూస్తున్నాడ‌ని ఆయ‌న కామెంట్ చేశారు. ఢిల్లీలో ఎవ‌రింటి ముందు ఎవ‌రు తిరుగుతున్నారో త‌న‌కు తెలుస‌న్నారు.

*

First Published:  30 Aug 2023 8:45 AM GMT
Next Story