Telugu Global
Andhra Pradesh

వైసీపీలో రెడ్ల పెత్తనం అవాస్తవం -బొత్స

అధికారానికి ఒక ఆకారం అంటూ ఉండదని, ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, వైసీపీలో రెడ్లకే అధికారం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం సరికాదని అన్నారు మంత్రి బొత్స.

వైసీపీలో రెడ్ల పెత్తనం అవాస్తవం -బొత్స
X

వైసీపీలో రెడ్ల పెత్తనం ఉందంటూ టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తమ పార్టీలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యముంటుందని వివరించారు. ఈనెల 7న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వైసీపీ బీసీ నేతలతో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స.. గతంలో ఏ ప్రభుత్వం చేయలేనన్ని కార్యక్రమాలు బీసీలకోసం వైసీపీ చేసిందన్నారు. బీసీలకు తమ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు.

అధికారానికి ఆకారం ఉంటుందా..?

అధికారానికి ఒక ఆకారం అంటూ ఉండదని, ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, వైసీపీలో రెడ్లకు అధికారం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం సరికాదని అన్నారు మంత్రి బొత్స. బీసీ సభ తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు సంబంధించి ఈ తరహా సభలు జరుపుతామని వెల్లడించారు. ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను జయహో బీసీ వేదికగా తిప్పి కొట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. విమర్శలకు తావు లేకుండా కేవలం బీసీల విషయాల వరకే ఈ సభ పరిమితం అవుతుందన్నారు. బీసీల సమస్యలు ఎన్ని తీర్చాం, వారికి ఇంకా ఏమేం చేయాలనే విషయంపై సభా వేదికగా చెప్తామన్నారు.

బాబుకి ఖర్మ పట్టింది..

వైసీపీ బీసీ మంత్రులు, ఇతర నాయకులు జయహో బీసీ సభ పోస్టర్ ఆవిష్కరించారు. చంద్రబాబుకు ఖర్మ పట్టి రాష్ట్రమంతా తిరుగుతున్నారని విమర్శించారు మరో మంత్రి జోగి రమేష్. . ఈ నెల 7న ఒక ఉప్పెన లాగ జయహో బీసీ సభ జరుగుతుందన్నారు.

84వేలమందికి ఆహ్వానం..

విజయవాడలో జరిగే జయహో బీసీ సభకు 84వేలమంది ప్రతినిధులు వస్తారని అంచనా. ఉదయం 8 గంటలకు సభా కార్యక్రమాలు మొదలవుతాయని, 10 గంటల నుంచి నేతల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు నాయకులు. 16 మంది నేతలు మాట్లాడతారని, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సీఎం జగన్ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు వెళుతున్నాయని చెప్పారు.

First Published:  1 Dec 2022 10:30 AM GMT
Next Story