Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్‌ను ఉద్దేశించి అంబ‌టి వెరైటీ ట్వీట్‌..

చంద్ర‌బాబు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్న‌ట్టు ఆధారాలు ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ నోరు విప్ప‌డం లేద‌ని, వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం సంబంధం అలాంటిద‌ని సెటైర్లు వేయ‌డం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్‌ను ఉద్దేశించి అంబ‌టి వెరైటీ ట్వీట్‌..
X

ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌ దాడుల‌కు త‌మ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌తిదాడులు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మంత్రి అంబ‌టి రాంబాబు. ఆయ‌న విమ‌ర్శ‌ల్లో వెట‌కారం స్ప‌ష్టంగా ధ్వ‌నిస్తూ ఉంటుంది. మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న తాజా చిత్రం `BRO` లో అంబ‌టిపై సెటైర్లు వేసేందుకు ఏకంగా ఒక క్యారెక్టర్‌నే క్రియేట్ చేయించ‌డం తెలిసిందే. అంబ‌టి పాత్ర‌లో పృథ్వీరాజ్‌ని ఆ పాత్ర‌లో న‌టింప‌జేయ‌గా, అది తీవ్రంగా వైర‌ల్ అయింది. దానిపై అప్ప‌ట్లో అంబ‌టి రాంబాబు కూడా స్పందించి గ‌ట్టిగానే కౌంట‌ర్లు ఇచ్చారు.

తాజాగా చంద్ర‌బాబు నాయుడుకు రూ.118 కోట్ల అవినీతి విష‌యంలో ఐటీ శాఖ నోటీసులు ఇవ్వ‌డం, ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా త‌న‌ను త్వ‌ర‌లో అరెస్టు చేస్తారేమో అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. ఐటీ నోటీసుల విష‌యంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు వైఎస్సార్‌సీపీ నేత‌ల నుంచి గ‌ట్టిగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం, ఒక్క ముక్క కూడా మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


ఈ నేప‌థ్యంలోనే అంబ‌టి ట్వీట్ చేశారు. ఇంత‌కీ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. `హ‌లో ఏమైపోయావు `BRO`.. బాబు గారు బొక్క‌లోకి పోతానంటున్నాడు.. వ‌చ్చి, ప‌ల‌క‌రించి.. పుల‌క‌రించి.. పో!` అని. ఐటీ నోటీసులు, త‌న‌ను అరెస్టు చేస్తారంటూ చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌పై ఇప్ప‌టికే అంబ‌టి కౌంట‌ర్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అరెస్ట్ చేస్తున్న‌ట్టు ఆయ‌న‌కు క‌ల వ‌చ్చింది.. అంటూ సెటైర్ వేశారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్న‌ట్టు ఆధారాలు ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ నోరు విప్ప‌డం లేద‌ని, వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం సంబంధం అలాంటిద‌ని సెటైర్లు వేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా అంబటి చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తారు.. లేదా స్పందించ‌కుండా కామ్‌గా ఉంటారా అనేది వేచిచూడాలి.

*

First Published:  9 Sep 2023 1:44 AM GMT
Next Story