Telugu Global
Andhra Pradesh

నేను ఆ పని చేస్తే నువ్వు ఉరేసుకు చస్తావ్ -అంబటి

అంజయ్య కేబినెట్‌ లో ఉన్నప్పుడు వైఎస్సార్ బ్యాగులు, సూట్ కేసులు చంద్రబాబు మోసేవారని చెప్పారు. తాను ఒక్క నిమిషం సంస్కారాన్ని పక్కనపెట్టి మాట్లాడితే చంద్రబాబు ఉరేసుకుని చస్తాడని అన్నారు అంబటి.

నేను ఆ పని చేస్తే నువ్వు ఉరేసుకు చస్తావ్ -అంబటి
X

చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో కేవలం సెటైర్లు వేసి వదిలిపెట్టిన అంబటి, ఈసారి ఏకంగా సంజయ్ గాంధీ పేరు కూడా ప్రస్తావించారు. సంజయ్ గాంధీ వద్ద చంద్రబాబు ఎలాంటి బ్రోకర్ పనులు చేశారో తనకు తెలుసన్నారు. తన దగ్గర ఆయన చిట్టా అంతా ఉందని, అది బయటపెడితే ఉరేసుకుని చస్తాడని మండిపడ్డారు.

ఆమధ్య అంబటి రాంబాబు ఫోన్ కాల్ అంటూ ఓ ఆడియో రికార్డింగ్ వైరల్ గా మారింది. ఆ తర్వాత టీడీపీ నేతలు అంబటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా ఆ ఫోన్ కాల్ ని గుర్తు చేసేవారు. ఈ కామెంట్ల విషయంలో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న అంబటి, మరోసారి ఇప్పుడు చంద్రబాబుపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అంజయ్య కేబినెట్‌ లో ఉన్నప్పుడు వైఎస్సార్ బ్యాగులు, సూట్ కేసులు చంద్రబాబు మోసేవారని చెప్పారు. చంద్రబాబు పెళ్లి సంగతి, ఆయన కుటుంబం గురించి, భార్య గురించి, కొడుకు గురించి, రామ్మూర్తి నాయుడు గురించి అందరికీ తెలుసని, తాను ఒక్క నిమిషం సంస్కారాన్ని పక్కనపెట్టి మాట్లాడితే చంద్రబాబు ఉరేసుకుని చస్తాడని అన్నారు అంబటి. ఇకనైనా చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకని మాట్లాడాలని, నోరు జారితే మాత్రం ఆయన ఉరేసుకునే విషయాలు తాను బయటపెడతానన్నారు.

ఇదేమి ఖర్మ టీడీపీకి..

ఇదేమి ఖర్మ అంటూ టీడీపీ మొదలు పెట్టిన కార్యక్రమం టైటిల్ ఆ పార్టీకి అతికినట్టు సరిపోతుందన్నారు అంబటి. ఇదేమి ఖర్మ తెలుగుదేశానికి అంటూ సెటైర్లు పేల్చారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయిందని, ఆయన ప్రారంభించిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజలే తిప్పికొట్టారని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ వదిలి రాకపోవడం టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ లో కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలవీ తీసేయను అంటున్నారని, అంటే జగన్ పాలన బాగున్నట్టే కదా అని చెప్పారు అంబటి. ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయపడటమే చంద్రబాబు ఖర్మ అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవమన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ను చంపేస్తామా??.. రాజకీయంగా వారు ఏమున్నారని చంపడానికి అంటూ సెటైర్లు వేశారు.

First Published:  1 Dec 2022 2:52 AM GMT
Next Story