Telugu Global
Andhra Pradesh

మా నీటి వాటా విషయంలో రాజీపడేది లేదు..

కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన వాటా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరగడానికి కారణం చంద్రబాబేనని మంత్రి అంబ‌టి చెప్పారు.

మా నీటి వాటా విషయంలో రాజీపడేది లేదు..
X

కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటా విషయంలో రాజీపడేది లేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోరాడారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. అయితే ఎల్లోమీడియా ఈ అంశంపై ఇష్టానుసారంగా కథనాలు ప్రచురిస్తోందని మంత్రి అంబ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. అయినా పచ్చ పత్రికలు ఈ అంశంపై రోత రాతలు రాస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు మాత్రమే నీటి వాటాపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి తప్పుడు కథనాల ద్వారా రాష్ట్రానికి నష్టం చేయొద్దని ఆయన కోరారు.

కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన వాటా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరగడానికి కారణం చంద్రబాబేనని మంత్రి అంబ‌టి చెప్పారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నా.. అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రైతులపాలిట చంద్ర‌బాబు ద్రోహిగా నిలిచిపోయారని విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం కృష్ణా జలాలపై తప్ప మిగిలిన విషయాలు మాట్లాడారని, చంద్రబాబు కోసమే పవన్‌ పనిచేస్తున్నారన్నారు.

First Published:  2 Dec 2023 1:59 PM GMT
Next Story