Telugu Global
Andhra Pradesh

శ్యాంబాబు కాదు, రాంబాబునే.. మంత్రి అంబటి మాస్ డ్యాన్స్

సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు అంటూ సాగే ఆ పాటకి ఆయనే స్టెప్పులేశారు. ఆ స్టెప్పులు, ఆయన ఉత్సాహం చూస్తుంటే.. బాగానే రిహార్సల్స్ చేసినట్టు అనిపిస్తోంది.

శ్యాంబాబు కాదు, రాంబాబునే.. మంత్రి అంబటి మాస్ డ్యాన్స్
X

సరిగ్గా గతేడాది సంక్రాంతి సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రతో అలాంటి డ్రెస్సులో, అవే స్టెప్పులు వేయించి ట్రోల్ చేయడంతో మరోసారి అంబటి డ్యాన్స్ చర్చనీయాంశమైంది. ఇంత జరిగాక ఆయన ఈసారి భోగికి డ్యాన్స్ వేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ మంత్రి మాత్రం తగ్గేదే లేదన్నారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈసారి కూడా మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు.

అంబటిపై పాట..

గతంలో ఒకరిద్దరు నాయకులపై పాటలు ఉండేవి. ఇటీవల ఈ సంప్రదాయం పంచాయతీ ఎన్నికల్లో కూడా కనపడుతోంది. మంత్రి అంబటి రాంబాబు కూడా తనపై ఓ పాట రాయించుకున్నారు. సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు అంటూ సాగే ఆ పాటకి ఆయనే స్టెప్పులేశారు. ఆ స్టెప్పులు, ఆయన ఉత్సాహం చూస్తుంటే.. బాగానే రిహార్సల్స్ చేసినట్టు అనిపిస్తోంది. భోగి మంట ముందు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు అంబటి. తాను పాలిటిక్స్ లో పొలిటికల్ రాంబాబుని అని, సంక్రాంతికి సంబరాల రాంబాబుని అని చెప్పుకొచ్చారాయన.


పవన్ కాచుకో..

గతంలో అంబటి రాంబాబు వేసుకున్న టీ షర్ట్ ని పోలి ఉండే దుస్తుల్ని 'బ్రో' సినిమాలో నటుడు పృథ్వికి వేసి ఆ క్యారెక్టర్ కి శ్యాంబాబు అనే పేరు పెట్టి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అయితే ఈసారి మంత్రి అంబటి మళ్లీ అలాంటి టీ షర్ట్ వేసుకోవడం విశేషం. ఎక్కడా తగ్గేది లేదు అనే సందేశం పంపించడం కోసమే ఆయన అదే డ్రెస్సింగ్ లో బయటకు వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి జనసేన నుంచి కౌంటర్లు ఉంటాయో లేదో.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ స్పందిస్తారేమో చూడాలి.

First Published:  14 Jan 2024 3:12 AM GMT
Next Story